కొద్ది క్షణాల్లోనే 6 లక్షల వ్యూస్..! మళ్లీ మళ్లీ చూసేలా.. దుమ్ము రేపుతున్న ఆదా ఇంస్టాగ్రామ్ వీడియో

హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఆదా సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది.

అయితే పనికి తగ్గ ప్రతిఫలం గురించి ఆలోచించకుండా అదా శర్మ ఎప్పుడూ ఎనర్జీ తో ఉంటుంది.

ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే.తనకు సంబంధించిన పిక్స్, వీడియోస్‌తో అభిమానులకు ఐ ఫీస్ట్ చేస్తుంటుంది.

తాజాగా ఆదా పోస్ట్ చేసిన కికీ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.ఆమె రిలీజ్ చేసిన వీడియోలో హిప్‌హాప్, భరతనాట్యం, కథక్‌కి సంబంధించిన బిట్స్‌ను ప్రదర్శించింది.అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రదర్శించి ఆదా.తన వీడియోను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తోంది.ఈ వీడియోలో ఆమె కాస్ట్యూమ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు ఆదాను అభినందిస్తున్నారు.ఈ వీడియోలో తాను వ్యక్తం చేసిన హావభావాలపై ఆదా శర్మ కూడా స్పందించింది.

Advertisement

తాను కథక్ రాజేంద్ర చతుర్వేది నుంచి.ఎక్స్‌ప్రెషన్స్ వైజయంతి మాలా నుంచి నేర్చుకున్నట్టు వివరణ ఇచ్చింది.

చిన్నప్పటి నుంచి తన తండ్రి తనను డ్యాన్స్‌లు చూసేలా ప్రోత్సహించారని తెలిపింది.ఈ కారణంగానే తాను అలా డ్యాన్స్ చేసినట్టు తెలిపింది.

Advertisement