పిచ్చి అంటే ఇదే.. పగిలిన గాజు ముక్కల డ్రస్ ధరించిన నటి.. నెటిజన్స్ ట్రోల్స్!

ఎప్పుడైతే అందరిలో సోషల్ మీడియా ప్రభావం ఏర్పడిందో.అప్పటి నుంచి యూజర్లంతా బాగా సోషల్ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా పలు రకాల ఖాతాలను క్రియేట్ చేసుకొని అందులో తమకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటున్నారు.ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు మాత్రం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.

ముఖ్యంగా నటీమణులు మాత్రం తమ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ తమ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు.

కొన్ని కొన్ని సమయంలో నెగటివ్ కామెంట్లు, ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంటారు.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా ఇంకా రెచ్చిపోతుంటారు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా ఓ బ్యూటీ కూడా తనకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు, ట్రోల్స్ వచ్చినా కూడా పట్టించుకోకుండా తన ఫోటోలతో బాగా రెచ్చిపోతుంది.ఇంతకీ ఆ బ్యూటీ ఎవరంటే బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఉర్ఫి జావేద్.

సినీ లవర్స్ కు ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.

పలు వివాదాలను తట్టి లేపడం లో సంచలనానికి మారు పేరు ఇక బుల్లితెరపై ఎంట్రీ బాలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ఇక మేరీ దుర్గ్ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేసి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అదే క్రమంలో పలు సీరియల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి బి టౌన్ లో అంతగా గుర్తింపు రాలేదు.

ఆ తర్వాత బిగ్ బాస్ ఒటీటీ వెర్షన్ లో ఎంపికై అడపాదడపా కొంతవరకూ గుర్తింపు సంపాదించుకుంది.కానీ బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను ఎంతో కాలం మెప్పించలేకపోయింది.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!

ఇక ఈమె సోషల్ మీడియాలో తన ఫోటోలతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు.హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.తనకు ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చిన కూడా అస్సలు పట్టించుకోదు.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా మరో హాట్ లుక్ తో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది.తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.

ఆ వీడియోలో తను పగిలిన గాజు ముక్కలతో డ్రెస్ ధరించింది.అంతేకాకుండా ఆ వీడియోకు.అవును.

నేను పగిలిన గాజు ముక్కల డ్రెస్ వేసుకున్నాను అంటూ.ఇది అద్భుతంగానే కనిపిస్తుంది.

కానీ ప్రజలు ఇలాంటివి చూసి నాకు వెర్రి, పిచ్చి అనుకుంటారు.నిజానికి మనమందరం క్రేజీగా, పిచ్చిగా ఉన్నామని తెలుసుకోండి.

కానీ నన్ను నేను చూసుకోవడానికి నాకు తగినంత తెలివి, శక్తి ఉన్నాయని తెలిపింది.దీంతో ఆమె డ్రెస్ ను చూసిన ప్రతి ఒక్కరు ఈమెకు నిజంగానే పిచ్చి అంటూ కామెంట్లు పెడుతున్నారు.