కొడుకు అలా, కూతురు ఇలా.. వాణిశ్రీ కి గర్భ శోకం

వాణిశ్రీ అలియాస్ రత్న కుమారి. కళాభినేత్రి గా తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో నలభయేళ్లు రాణించింది.

హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె చేసిన సినిమాలు, నటించిన పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.ఆమె జీవితంలో ఆస్తులు పోగొట్టుకొని బాధ పడి చివరికి మళ్లి తిరిగి అన్నిటిని పొంది కోర్ట్ లో కేసులు వేసి , అవి కూడా నెగ్గింది.

ఇక సినిమాలు వద్దనుకున్నా తర్వాత డాక్టర్ ని పెళ్లి చేసుకొని సినిమాల నుంచి విరామం ప్రకటించింది.ఇక ఆమె సినిమా జీవితం అందరికి తెలిసిన పుస్తకమే.

ఇప్పటికే వెబ్ లో ఎన్నో కథనాలు ఆమె పై వచ్చాయి.అయితే ఆమె జీవితంలో ఎంతో సాదించిన అక్క పై ఆస్థి కోసం పోరాడి దక్కించుకొని నెగ్గిన సంతానం విషయంలో మాత్రం చాల ఇబ్బందులు పడుతుంది.

Advertisement

వాణిశ్రీ ఆమె ఫ్యామిలి డాక్టర్ ని పెళ్లి చేసుకున్నాక వారికి ఇద్దరు సంతానం కలిగారు.ఒక అబ్బాయి మరియు అమ్మాయి.

అయితే అబ్బాయి పేరు అభినయ వెంకటేష్ కార్తీక్.తండ్రి లాగ డాక్టర్ అయ్యాడు.

అన్నపూర్ణ మెడికల్ కాలేజ్ లో చదివి ఊటీలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసేవాడు.ఇక తమిళ నాడు లో చెంగల్పట్టు లో తన సొంత నివాసం లో రాత్రి పడుకున్న టైం లో నిద్ర లోనే హార్ట్ అటాక్ వచ్చి కన్ను మూసాడు.

ఆలా వాణిశ్రీ కి అతి పెద్ద షాక్ తగిలినట్టు అయ్యింది.ఇప్పటికి ఆమె కొడుకు మరణం నుండి బయటకు రాలేకపోతుంది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

అతడిని హీరో చేయాలనీ తొలుత వాణిశ్రీ భావించినప్పటికీ అభినయ్ కి చదువు అంటేనే ఇష్టం అందుకే డాక్టర్ గా సెటిల్ అయ్యాడు.

Advertisement

ఇక కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా డాక్టర్ కావడం విశేషం.36 ఏళ్ళ చిన్న వయసులోనే అయన కన్ను మూయడం అటు వాణిశ్రీ తో పాటు ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది.ఇక కూతురు పేరు అనుపమ.

ఇప్పటికి ఆమె వివాహం చేసుకోలేదు.ఆమె కూడా డాక్టర్ గా సెటిల్ అయ్యింది.

ఆమెకు పెళ్లి చేయాలనీ వాణిశ్రీ ఎంత ప్రయత్నించినా కూడా అందుకు అనుపమ ఒప్పుకోవడం లేదు.ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయింది అయినా కూడా పెళ్ళికి అనుపమ పూర్తి విముఖత చూపిస్తుంది.

ఒక వైపు కొడుకు ఆలా కన్ను మూస్తే మరో వైపు కూతురు మాత్రం ఇంకా ఒంటరిగానే ఉంటుంది .దాంతో వాణిశ్రీకి సంతానం విషయంలో చాల నిరాశ మిగిలింది.

తాజా వార్తలు