మామూలుగా సెలబ్రెటీలు తమ పిల్లలపై మీడియా దృష్టి కూడా పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.చెప్పాలంటే వారిపై ఈగ కూడా వాళ్లనివ్వరు.
ఇక ఎక్కడికైనా వెళ్తే వారిని పూర్తిగా కప్పేసి చేతులు అడ్డుపెట్టి మరి తీసుకెళ్తూ ఉంటారు.మరి కొంతమంది అలా కాదు.
పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తారు.వాళ్ళు ఏం చేసినా కూడా ఓపికతో ఉంటారు.
చెప్పాలంటే సామాన్యుల పిల్లలు ఎలా అయితే ఆడుకుంటారో వాళ్లకు కూడా అటువంటి స్వేచ్ఛ అందిస్తూ ఉంటారు.అందులో ఒకరు శ్రియ శరణ్( Shriya Saran ) అని చెప్పాలి.
శ్రియ శరణ్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.అప్పట్లో తన అందాలతో కుర్రకారును ఓ రేంజ్ లో ఆకట్టుకుంది.
నటన పరంగా మంచి అభిమానం సంపాదించుకుంది.తెలుగులో చాలా సినిమాల్లో నటించి ఎప్పటికీ గుర్తుండిపోయే నటిగా నిలిచింది.
ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయక పాత్రలు చేస్తుంది శ్రియ.
మంచి హోదాలో ఉన్నపుడు శ్రియ పెళ్లి చేసుకొని పండంటి ఆడబిడ్డకు( Shriya Saran Daughter ) జన్మనిచ్చింది.తను చేసుకున్న పెళ్లి కూడా సీక్రెట్ గా జరగగా.తను బిడ్డ కన్న విషయం కూడా సీక్రెట్ గానే జరిగిపోయింది.
కొన్ని రోజుల వరకు తన ప్రెగ్నెంట్ విషయాన్ని చెప్పలేదు.కనీసం బిడ్డ పుట్టాక కూడా ఎవరి దృష్టిలో పడనివ్వలేదు శ్రియ.
దీనికి కారణం ఆమె తల్లి అయిందంటే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయో రావో అని అలా చెప్పలేదని చాలామంది అనుకున్నారు.
కానీ కొంతకాలం తర్వాత తనే తన బిడ్డను అందరికీ పరిచయం చేసింది.ఇక తన బిడ్డ పేరు రాధ ( Radha ) అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పగా చాలామంది ఆ పేరు విని ఫిదా అయ్యారు.శ్రియ అందరిలాగా వెస్ట్రన్ పేర్లు పెట్టకుండా మంచి పేరు పెట్టింది అంటూ పొగిడారు.
తన కూతురు గురించి అందరికీ చెప్పటమే కాకుండా తనకి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పంచుకుంటూ ఉంటుంది.ఒక వైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటుంది శ్రియ.
ఖాళీ సమయం దొరికితే చాలు ఎక్కువగా తన కూతురితోనే గడిపేస్తుంది.అంతేకాకుండా తన కూతురిని అంత రిచ్ గా తయారు చేయకుండా మామూలుగా నాచురల్ గా తయారు చేస్తూ ఉంటుంది.
ఇక తన కూతురు ఎటువంటి ఆటలు ఆడిన కూడా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన కూతురు ఆడుకుంటున్న వీడియోలను తను స్టోరీ రూపంలో పంచుకుంది.అందులో తన కూతురు మట్టిలో ఆడుతూ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
ఆ ఫోటో చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఆ బుడ్డది ఆవును ముద్దాడుతూ ఉన్న కూడా శ్రియ సపోర్ట్ చేసింది.ఇక ఆ ఫోటోలు చూసి శ్రియ అందరి సెలబ్రిటీల లాగా కాదు.
తన కూతుర్ని సామాన్య ప్రజలు ఎలా అయితే పెంచుతారో అలా పెంచుతుంది.తనకు అన్ని రకాల ఆటలను ఆడటానికి బాగా సపోర్ట్ చేస్తుంది.
అసలు ఎవరైనా సెలబ్రిటీలు ఇలా ఉంటారా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy