సినిమాల్లో రీఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన రంభ.. ఆ ఆశ మాత్రం నాకు లేదంటూ?

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ( Rambha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ తరం ప్రేక్షకులకు ఈమె గురించి అంతగా తెలియక పోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులు హీరోయిన్ రంభను ఇట్టే గుర్తుపట్టేస్తారు.

ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రంభ.తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.తెలుగుతో పాటు ఇతర బాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది రంభ.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు రంభ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సినిమాల్లో నటించి పాతికేళ్ళు గడిచిపోయింది.

అనేక మంది హీరోలతో కలిసి నటించాను.అందుకే నాకు ఫలానా హీరో చిత్రంలో నటించాలన్న ఆశ లేదు.

Advertisement

మంచి కథ, పాత్ర వస్తే మాత్ర ఖచ్చితంగా మళ్ళీ నటిస్తాను అని చెప్పుకొచ్చింది రంభ.

అనంతరం ఆమె మాట్లాడుతూ.కోలీవుడ్ హీరో దళపతి విజయ్ ( Vijay )రాజకీయాల్లోకి రావడం అనేది ఒక సాహసంతో కూడుకున్నది.ఆయనతో కలిసి నినైత్తేన్‌ వందాయ్‌ వంటి ఒక‌టి రెండు చిత్రాల్లో నటించాను.

అప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పులేదు.కాకపోతే అపుడు మౌనంగా ఉండేవారు.

ఇపుడు కాస్త జాలీగా మాట్లాడుతున్నారు అని చెప్పుకొచ్చింది రంభ.మరి హీరోయిన్ రంభకు ఏ డైరెక్టర్ సినిమాలో అవకాశాన్ని ఇస్తారో చూడాలి మరి.

ఆ పని చేసే అంత డబ్బు నా దగ్గర లేదు.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు