పూజ చేస్తే ట్రోల్ చేస్తారా.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన నటి ప్రణీత?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రెటీల గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే కొందరు ఈ వార్తలను రెండు కోణాలలో చూస్తుంటారు.

కొందరు పాజిటివ్ గా తీసుకోగా మరికొందరు నెగిటివ్ గా భావిస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఇలాంటి నెగటివ్ కామెంట్లను ఎదుర్కొంటున్నారు నటి ప్రణీత సుభాష్.

ఈమె పలు తెలుగు సినిమాలలో నటిగా నటించి మంచి గుర్తింపు పొందారు.గత ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.

ఇకపోతే ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఎన్నో ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే భీమన అమావాస్య సందర్భంగా తన భర్తకు పాద పూజ చేసిన విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఈ పూజకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలామంది నెగటివ్ కామెంట్లతో ట్రోల్ చేశారు.

ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఈమెపై ప్రశంసల కురిపించగా మరికొందరు మాత్రం ఇంకా ఏ కాలంలో ఉన్నావు తల్లి.ఇలా భర్త పాదాలకు పూజ చేస్తున్నావు అంటూ కామెంట్లు చేశారు.ఈ కామెంట్లపై స్పందించిన ఈమె తాను చిన్నప్పటి నుంచి ఇలాంటి సాంప్రదాయాలను చూస్తూ పెరిగానని తాను ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన ఆచారాలను సాంప్రదాయాలను మరిచిపోనని తెలిపారు.

నేనెప్పుడూ సాంప్రదాయాలను మరిచిపోనని నేను ఇలాంటి ఆచార సాంప్రదాయాలను పాటించే కుటుంబంలోనే పుట్టి పెరగానని ఈమె తెలిపారు.మోడ్రన్ గా ఆలోచించడం అంటే మనం నడిచొచ్చిన దారిని మరిచిపోవడం కాదని ప్రణీత తన గురించి ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పారు.

ఇలా ప్రణీత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు