Actress Pragathi: హెవీ వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న ప్రగతి.. నెట్టింట ఫొటోస్ వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి( Actress Pragathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రగతి.

తెలుగులో ఎక్కువగా హీరో,హీరోయిన్ లకు మదర్ క్యారెక్టర్ లో నటించి మెప్పించింది.ఇకపోతే ప్రస్తుతం ప్రగతి అడపాదడపా సినిమాలలో నటిస్తూ మెప్పిస్తోంది.

ప్రగతి ఈ మధ్యకాలంలో విడుదల అయినా డీజేటిల్లు, ఎఫ్‌3, రంగ రంగ వైభవంగా, గాడ్‌ ఫాదర్‌, స్వాతిముత్యం లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.త్వరలో విడుదల కానున్న భోళా శంకర్( Bhola Shankar ) సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.

ఇకపోతే ప్రగతి సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు.

Advertisement

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.మరీ ముఖ్యంగా ఆమె తన ఫిట్నెస్ విషయంలో( Fitness ) ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.తరచూ జిమ్ లో కసరత్తులు చేస్తూ డ్యాన్సులు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ వయసులో కూడా జగతి ఆ రేంజ్ లో కసరత్తులు చేయడం చూసి అభిమానులు షాక్ అవుతుంటారు.ఇప్పటివరకు కేవలం చిన్న చిన్న వర్కౌట్స్ ని మాత్రమే చేసిన ప్రగతి వెయిట్‌ లిఫ్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

పవర్‌ లిఫ్టింగ్‌( Power Lifting ) పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతుంది.తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఒక వీడియోని కూడా పంచుకుంది.

ఇందులో ప్రగతి షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది.వెయిట్‌ లిఫ్టర్‌ డ్రెస్‌ ధరించింది.వర్కౌట్స్ చేస్తుంది.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

ఆఫ్రికన్ స్టైల్ లో జుట్టుని జడ లాగా వేయించుకుంది.బ్లాక్‌ టీషర్ట్, షార్ట్ ధరించింది.

Advertisement

తన థండర్‌థైస్‌ తో అదరగొడుతూనే తన లక్ష్యంపై ఫోకస్ పెట్టి సీరియస్ గా పవర్‌ లిఫ్టింగ్‌లో ప్రాక్టీస్‌ చేస్తుంది.ముందస్తుగా వామప్‌లతో అదరగొడుతోంది.

హాట్‌ అండ్‌ హార్డ్ వర్కౌట్‌ చేస్తూ చెమటోడుస్తుంది.వ్యాయామాల తర్వాత ఆమె వెయిట్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్ చేసింది.

ఇందులో కఠినంగా ఆమె ప్రాక్టీస్‌ చేయడం విశేషం.ఇదిలా ఉంటే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఫోటోలు చూసిన అభిమానులు ప్రగతి పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజా వార్తలు