ప్రభాస్ క్యారెక్టర్ ఏ హీరోకు లేదు.. అతను గ్రేట్: పూనమ్ కౌర్

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా మార్చి 11న థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.

మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రభాస్ పేరు మార్మోగిపోతోంది.ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సినిమా రానే రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

ఇక ఇది ఇలా ఉంటే ఎప్పటిలాగే కొంతమంది సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు.కొంతమంది రాధేశ్యామ్ సినిమా హిట్ అని చెప్పగా మరి కొంతమంది ప్లాప్ అంటూ కూడా చేస్తున్నారు.

ప్రత్యేకించి ఒక వర్గం ఇలా రిలీజ్ అయిన ప్రతి సినిమాకి ఈ విధంగా కామెంట్లు చేస్తూనే ఉంటారు.ఇకపోతే ఇదిలా ఉంటే తాజాగా రాధేశ్యామ్ సినిమాపై, హీరో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించింది నటి పూనమ్ కౌర్.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ హీరో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.స్టార్స్ చాలా మంది ఉన్నారు, యాక్టర్స్ చాలామంది ఉన్నారు.

కానీ మన భారతదేశంలో మనుషుల్ని మమ్మీ, ఐదు సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి అది కూడా ప్రైమ్ టైమ్ లొ కేటాయించడం అన్నది చాలా గొప్ప విషయం.ఆయన లుక్స్ గురించి కాదు, క్రేజ్ గురించి కాదు వ్యక్తిత్వం గురించి నమ్మని వాళ్ల కోసం నిలబడటమే ఆ క్యారెక్టర్ అంటూ ప్రభాస్ పై పొగడ్తల వర్షం కురిపించింది.

బాహుబలి సినిమాతో రికార్డులను బ్రేక్ చేస్తూ తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పారు అని తెలిపింది పూనం కౌర్.అనంతరం రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడుతూ.నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం.

వాటిలో ఇండియన్ లవ్ స్టోరీస్ అంటే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు.ఇక రాధేశ్యామ్ సినిమా కూడా మంచి లవ్ స్టోరీ కావడం సో ఐ లైక్ ఇట్ అది తెలిపింది పూనమ్ కౌర్.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

అదేవిధంగా టైలర్ లో ఆయన కుర్చీలో కూర్చుని చెప్పిన డైలాగ్ నాకు బాగా నచ్చింది అని తెలిపింది పూనమ్ కౌర్.

Advertisement

తాజా వార్తలు