హీరోయిన్ నమిత బేబీ బంప్ ఫోటోలు, వీడియోలు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇకపోతే నమిత తెలుగులో జెమిని,బిల్లా,సింహా లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యింది నమిత.

సింహ సినిమాలో సింహం అంటే చిన్నోడు వేటకు వచ్చాడు అన్న పాట తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది.టాలీవుడ్ లో వెంకటేష్, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలతో నటించి మెప్పించింది నమిత.

ఇకపోతే ఈ ప్రస్తుతం నమిత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.కాగా ఆమె త్వరలోనే తల్లి కాబోతున్నట్లు ఈ ఏడాది మే నెల 10వ తేదీన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తన భర్త వీరేంద్ర చౌదరితో కలిసి బేబీ బంప్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.ఆ తరువాత ఇటీవల నమిత సీమంతం కూడా ఘనంగా జరిగింది.

Advertisement

అందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్‌ చేసింది నమిత.తాజాగా తన బేబీ మరోసారి ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేసింది.

అయితే ప్రస్తుతం నమిత 9 నెలల గర్భవతిగా ఉంది.త్వరలోనే ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఈ క్రమంలో 9 నెలల గర్భవతిగా ఉన్న ఆమె ఫొటోషూట్‌ను తాజాగా నిర్వహించింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్‌ చేసింది.దీంతో ఆమె ఫొటోలు, వీడియోలు కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.కమ్మింగ్‌ సూన్‌ అంటూ తన ఫొటోషూట్‌ను పోస్ట్‌ చేసింది.

తెలంగాణ అని చెప్పుకునే విజయశాంతి నిజంగా ఎక్కడ పుట్టి, పెరిగింది

ఈ ఫోటోలు చూసిన ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పలువురు అభిమానులు అయితే సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

కాగా నమిత 2017లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని తో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు