కీర్తి సురేష్ ( Keerthy Suresh ) పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ తెలుగు భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక చివరిగా ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన దసరా( Dasara ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇందులో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ జీవించేసారని చెప్పాలి.ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ త్వరలోనే భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి తమన్న జంటగా నటించిన ఈ సినిమాలో ఈమె చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కాబోతోంది.
ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వెళ్లబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించడం గురించి మాట్లాడుతూ తనకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందని తెలిపారు.తాను సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకునే లోపు ఒక్కసారైనా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ( Sharukh Khan ) తో కలిసి సినిమా చేయాలని అలాగే డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా అయినా చేయాలి అనే కోరిక ఉంది అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.
ఇలా బాలీవుడ్ సినిమాల గురించి ఈమె ఇలాంటి కామెంట్ చేయడంతో కీర్తి సురేష్ ఈరోజు కాకపోయినా త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy