హీరోల కుక్కపిల్లకు కూడా రూమ్ ఇస్తారు కానీ హీరోయిన్లకు.. జయసుధ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి తరం కథానాయికల్లో సహజనటిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ఎవరూ అంటే ప్రతి ప్రేక్షకుడు జయసుధ పేరు చెబుతూ ఉంటారు.అనుకోని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయసుధ ఇక ఇండస్ట్రీలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని కోట్ల మంది అభిమానులను తన నటనతో మెప్పించింది.

1972లో పండంటి కాపురం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది జయసుధ.అప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్ లుగా కొనసాగుతున్నారు.

ఇక వారి నుంచి ఎంతో పోటీ ఉన్నప్పటికీ జయసుధ మాత్రం తన నటన తోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని చెప్పాలి.పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఎప్పుడు ప్రేక్షకులను మెప్పించే వారు.

అయితే ఇటీవల జయసుధ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇక ఇందులో ఏ సెలబ్రిటీ పాల్గొన్న వాళ్ళు చెప్పిన సమాధానాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్.

Advertisement

ఇప్పుడు జయసుధ చెప్పిన సమాధానాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.నటిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే బాలీవుడ్ లో అయితే కనీసం ఒక ఫ్లవర్ బొకే అయినా ఇంటికి పంపించేవారు.

కానీ టాలీవుడ్ లో మాత్రం అది పంపించిన వాళ్లు కూడా లేదు.అదే ఒక హీరో ఈ ఘనత సాధిస్తే హడావిడి వేరే రేంజిలో ఉంటుంది అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.హీరోలను ఒకలా హీరోయిన్ లను ఒకల చూడటం ఇండస్ట్రీలో కనిపించింది.

పైగా సక్సెస్ అయినా హీరోలను అయితే మరింత ప్రత్యేకంగా చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది.ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను కూడా చెప్పుకొచ్చారు జయసుధ.

ముంబై నుంచి వచ్చిన వారి కుక్క పిల్లకు కూడా రూమ్ ఇస్తారు.ఎప్పుడు కూడా హీరోల వైపు నుంచి అసలు ఎలాంటి సమస్య ఉండదు.అతి చేసేది మొత్తం హీరో పక్కన ఉన్నవాళ్లే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..

హీరో సరిగ్గా డాన్స్ చేయకపోతే హీరోయిన్లు మూమెంట్ చేయడం లేదని అనే డైరెక్టర్లు కూడా ఉన్నారు.ఇన్నేళ్లలో ఎంతో కెరియర్ చూశాను.కానీ డబ్బులు మాత్రం వెనక్కి చేసుకోలేకపోయాను.

Advertisement

సావిత్రి మహానటి సినిమా కాస్త ముందుగా తీసి ఉంటే అది చూసి నేను సినిమాలు తీయడం మానుకునే దానిని తద్వారా కాస్త తక్కువగా నష్టపోయే దానిని అంటూ జయసుధ నవ్వేశారు.

తాజా వార్తలు