ఓంకార్ వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వినోద్

బుల్లితెరపై అత్యద్భుతమైన యాంకర్‌గా దాదాపు దశాబ్ద కాలం నుంచి సందడి చేస్తున్న యాంకర్ ఓంకార్.

డ్యాన్స్ షోస్‌తో మొదలై ‘మాయాద్వీపం, సిక్స్త్ సెన్స్, డ్యాన్స్ ప్లస్’ షోస్‌కు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే ఓంకార్ బుల్లితెరపైనే కాదు వెండితెరపైన కూడా సందడి చేశారు.అయితే, వెండితెరపైన నటుడిగా కాకుండా డైరెక్టర్‌గా తన పేరు వేసుకున్నాడు ఓంకార్.

‘రాజు గారి గది’ అనే సినిమాకు రెండు సీక్వెల్స్ తీసి సక్సెస్ ఫుల్ డెరక్టర్‌గా సత్తా చాటాడు ఓంకార్.‘రాజుగారి గది 2’ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత నటించారు.

‘రాజుగారి గది3’ ఫిల్మ్‌లో ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు లీడ్ రోల్ ప్లే చేశాడు.ఈ సంగతులు పక్కనబెడితే.

Advertisement
Actor Vinod Sensational Comments On Anchor Omkar , Omkar, Actor Vinod , Aata Pro

ఇటీవల ఓంకార్‌పై కొరియోగ్రాఫర్ వినోద్ సంచలన కామెంట్స్ చేశాడు.

Actor Vinod Sensational Comments On Anchor Omkar , Omkar, Actor Vinod , Aata Pro

‘ఆట’ప్రోగ్రాం ద్వారా ఓంకార్ ఎంతో మంది డ్యాన్సర్స్‌ను టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు.అలా ఇంట్రడ్యూస్ అయిన వారిలో ఒకరు వినోద్.అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా వినోద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజగా ఓ యూట్యూబ్ చానల్ వారు నిర్వహించిన ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడాడు.ఈ క్రమంలోనే పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఓంకార్ అసలు తనకు అవకాశాలు ఇవ్వలేదని అన్నాడు.అందుకు గల కారణాలు కూడా వివరించాడు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

నిజానికి తనకు ఓంకార్‌తో మంచి అనుబంధం ఉందని, అయినా తనకు అవకాశాలు ఇవ్వలేదని చెప్పాడు.తనకు అవకాశాలు ఇవ్వకపోవడంతో తాను ఓంకార్‌తో మాట్లాడటం తగ్గించేశాని అలా తనకు, ఓంకార్‌కు మధ్య మాటలు తగ్గిపోయాయని వివరించాడు.

Advertisement

ఓంకార్ తన స్వార్థం కోసం అలా అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించాడు.ఓంకార్ తన అవసరాల కోసం ఇతరులను వాడుకుంటాడని, అలా అవకాశం కోసం వెళ్లి ఆయన చేతిలో మోసపోయిన వారిలో తాను ఒకడినని వినోద్ అన్నాడు.

ఓంకార్ గురించి వినోద్ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఓంకార్ యాంకర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు.

తాజా వార్తలు