విక్రమ్ లో సూర్య తన రోల్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు.అయితే ఈయన హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.

హిట్ లేకపోవడంతో తన ఫామ్ కోల్పోయాడు.అయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించాక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయినా విషయం తెలిసిందే.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

Advertisement

లోకేష్ కనకరాజ్ కూడా తన సినిమాలను విభిన్నంగా తెరకెక్కిస్తుంటాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య కూడా నటించారు.ఇంత మంది కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసారు.ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ఫస్ట్ షో నుండే అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి టాక్ తో స్టార్ట్ అయినా ఈ సినిమా ఆ తర్వాత మంచిగా పికప్ కూడా అయ్యింది.

అయితే ఈ సినిమాలో సూర్య లాస్ట్ లో కనిపించిన క్యామియో రోల్ తో ఈ సినిమాను మరో రేంజ్ లోకి తీసుకు వెళ్ళాడు.అయితే సూర్య ఈ సినిమాలో చేసిన రోల్ కోసం ఎంత తీసుకున్నాడు అనే చర్చ సాగుతుంది.

రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

ఇంత ఆదరణ లభించిన ఈ రోల్ కోసం సూర్య ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట.అలా కమల్ కోసం ఒప్పుకుని మరో మాట లేకుండా తన పాత్ర చేసుకుని వెళ్ళిపోయాడట.

Advertisement

తాజా వార్తలు