షఫీ.20 ఏళ్ల క్రితం ఖడ్గం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా విజయవంతం కావడం తో షఫీ కి మంచి గుర్తింపు లభించింది.
ఈ చిత్రం తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికి ప్రభాస్ సినిమా చత్రపతి లో, మహేష్ బాబు సినిమా ఖలేజా లో అద్భుతంగా నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందాడు.20 ఏళ్ల నుంచి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ దాదాపు 50 సినిమాల వరకు మాత్రమే నటించాడు షఫీ.తాను చేసే సినిమాలో తనకు ఎంత ప్రాధాన్యత ఉందో అది మాత్రమే చూసుకొని నటిస్తూ వస్తుండటం తో ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు.షఫీ కేవలం క్యారెక్టర్ గా మాత్రమే కాదు ఒక సినిమాలో హీరోగా కూడా నటించాడు.
హీరోయిన్ నందితా దాస్ నటించిన కమిలి అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించాడు.ఈ చిత్రం నేషనల్ అవార్డ్ దక్కించుకుంది.తిరుపతి దగ్గర చంద్రగిరి లో పుట్టి పెరిగిన షఫీ కెరియర్ మొత్తం పైన ఒక నంది అవార్డుతో పాటు ఫిలింఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.
చిన్నతనం నుంచి నాటక రంగానికి అలాగే సినిమాకి ఎంతో ప్రభావితం అయ్యాడు, అయితే తిరుపతిలో ఎంతో ప్రయోగాత్మకంగా ఒక నాటక సంస్థ నెలకొల్పాలని ప్రయత్నించినప్పటికీ అది వీలు కాలేదు.దాంతో సినిమా పై ఉన్న ఇష్టంతో ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చేరాడు.
అక్కడ నుంచి ఖడ్గం సినిమాలో నటించేందుకు అవకాశం సంపాదించుకున్నాడు.ఖడ్గం సినిమాలో తీవ్రవాదిగా నటించడానికి షఫీ ఇంతవరకు ఏ నటుడు చేయని సాహసం చేశాడు.చార్మినార్ వీధుల్లో తన స్నేహితుడి ఇంట్లో ఒక నెల రోజుల పాటు అక్కడే నివాసం ఉండి, అక్కడి వారి అలవాట్లు బాగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఖడ్గం సినిమాలో నటించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పాలి.
ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర కోసం అంత రిస్క్ చేసుకున్న నటుడు ఎవరు లేరనే చెప్పాలి.అందుకే షఫీ పాత్ర బాగా క్లిక్ అయ్యింది.ఇక చివరగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించిన షఫీ మరికొన్ని సినిమాలతో అలరించబోతున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy