నటుడుగా, నిర్మాతగా నాని ఇప్పటివరకు సంపాదించిన ఆస్తులు ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి  సక్సెస్ అందుకున్న వారిలో నటుడు నాని(Nani) ఒకరు.

ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్నారు.

సినిమాలపై ఆసక్తితో నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఇలా పలు సినిమాలకు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే అష్టా చమ్మ సినిమాలో అవకాశం వచ్చింది.

ఈ సినిమాలో హీరోగా నటించిన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక అష్టా చమ్మా సినిమా మంచి సక్సెస్ అయిన తరువాత నాని వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

నాని టైర్ 2 హీరోలలో నెంబర్ వన్ పొజిషన్లో దూసుకుపోతున్నారు.ఇక తనలాగే ఎంతోమంది బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వారికి కూడా నాని నిర్మాతగా మారి అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇకపోతే ఇటీవల నాని వరుస సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా మారి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.తాజాగా నాని కోర్టు(Court) సినిమాకు నిర్మాతగా వ్యవహరించి మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక త్వరలోనే హిట్ 3 (Hit 3)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇలాంటి తరుణంలోనే హీరోగా నిర్మాతగా నాని సంపాదించిన ఆస్తులు (Assets)వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.

నాని తన మొదటి సినిమా కోసం నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారు అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు సుమారు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ ద్వారా అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ భారీ లాభాలను కూడా అందుకుంటున్నారు.ఇది మాత్రమే కాకుండా ఈయన ఒట్టో, స్ప్రైట్, మినిట్ మెయిడ్, క్లోజప్ వంటి బ్రాండ్స్ కు ఉన్న ఒప్పందాలతోనూ కోట్లల్లోనే సంపాదిస్తున్నారు.ఇలా పలు నివేదికల ప్రకారం నాని ఆస్తులు నికర విలువ సుమారు రూ.300 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.ఇక నాని వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది.రేంజ్ రోవర్ 3.0, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఫార్చూనర్, టోయోట ఇన్నోవా క్రిస్టా బట్టి కార్లు తన గ్యారేజ్ లో ఉన్నాయి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు