బ్రాహ్మజీ లవ్ స్టొరీ తెలిసి ఫిదా అవుతున్న కుర్రాళ్ళు...

సినిమాల్లోకి వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడు తిని తినక నరకం అనుభవించి మొత్తానికి నటులై ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో బ్రాహ్మజీ( Brahmaji ) ఒకడు.

నిజానికి ఆయన గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ర‌క‌ర‌కాల పాత్ర‌లు పోషిస్తూ ఇండ‌స్ట్రీలో బ్ర‌హ్మాజీ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.ఇక విభిన్న‌మైన పాత్ర‌ల్లో వైవిధ్యాన్ని చూపిస్తూ.

ఇప్ప‌టికీ బిజీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొన‌సాగుతున్నారు.రీసెంట్ గా విడుద‌లైన విరూపాక్ష‌( Virupaksha ) మూవీలోనూ డాక్ట‌ర్ గా బ్ర‌హ్మాజీ ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు.

ఈ సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే.ఇక‌పోతే బ్ర‌హ్మాజీ వ్య‌క్తిగ‌త జీవితం గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు.

Advertisement

నిజానికి బ్ర‌హ్మాజీ లైఫ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ల‌వ్ స్టోరీ ఉంది.ఈయ‌న ల‌వ్ స్టోరీలో( Brahmaji Love Story ) ఉన్న ట్విస్ట్‌లు సినిమాలో కూడా ఉండ‌వు.

అలాంటి గొప్ప లవ్ స్టోరీ బ్రాహ్మజీ ది.బెంగాలీ మ‌హిళ శాశ్వ‌తిని బ్రహ్మాజీ ప్రేమించాడు.వీరిద్ద‌రికీ చెన్నైలో ప‌రిచ‌యం అయింది.

ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.శాశ్వ‌తికి త‌న ప్రేమ‌ను బ్ర‌హ్మాజీ ఎంతో రొమాంటిక్ గా వ్య‌క్త‌ప‌రిచార‌ట‌.

ఓప‌క్క‌ మూన్ లైట్‌.మ‌రోప‌క్క స‌న్ లైట్‌.

జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

హైస్పీడ్ లో శాశ్వ‌తి ద‌గ్గ‌రికి వెళ్లి ఐ లవ్ యూ అని చెప్పార‌ట‌.ఆమెతో గంట‌లు త‌ర‌బ‌డి ఫోన్‌లో మాట్లాడేవార‌ట‌.

Advertisement

శాశ్వ‌తి బ‌ర్త్‌డేని బ్ర‌హ్మీజీ త‌న చైన్ తాక‌ట్టు పెట్టి మ‌రీ సెల‌బ్రేట్ చేశార‌ట‌.ఫైన‌ల్ గా పెద్ద‌ల‌ను ఒప్పించి వీరిద్ద‌రూ పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యారు.అయితే బ్ర‌హ్మాజీతో ప్రేమ‌లో ప‌డ‌టానికి ముందే శాశ్వ‌తికి ఒక పెళ్లి జ‌రిగింది.

ఆమె త‌న మొద‌టి భ‌ర్త ద్వారా ఒక కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది.ఆ త‌ర్వాత వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది.

ఈ విష‌యాలు అన్నీ తెలిసిన‌ప్ప‌టికీ బ్ర‌హ్మాజీ త‌న ప్రేమ‌ను చంపుకోలేదు.ఆమెతో ఏడడుగులు వేశాడు.

ఆమె కొడుకును త‌న కొడుకుగా భావించాడు.

త‌న‌కు పిల్ల‌లు పుడితే ఎక్క‌డ స్వార్థపూరిత‌మైన ఆలోచ‌న‌లు వ‌స్తాయో అని బ్ర‌హ్మాజీ సంతానం వ‌ద్ద‌నుకున్నారు.తన భార్య కుమారుడినే తన కుమారుడిగా పెంచి పెద్ద చేసి.పెళ్లి కూడా చేశాడు.

ఆ అబ్బాయి మ‌రెవ‌రో కాదు సంజయ్ రావు. ఇత‌డు ఓ పిట్టకథ మూవీ ద్వారా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు.

నిజంగా సినిమాల్లో చూపించే లవ్ స్టొరీ కంటే కూడా బ్రాహ్మజీ లవ్ స్టొరీ చాలా గొప్పది ఈయన లవ్ స్టొరీ తెలుసుకున్నప్పటి నుంచి యువత అందరూ బ్రాహ్మజీ గారి వ్యక్తిత్వం గురించి ఆయనకి శాశ్వతి మీద ఉన్న ప్రేమ గురించి చాలా గొప్ప గా చెప్పుకుంటున్నారు.

తాజా వార్తలు