రెమ్యునరేషన్ పై అజయ్ షాకింగ్ కామెంట్స్.. ఎంత తీసుకుంటారంటే?

సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అజయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్ చాలా పెద్దదని లైఫ్ లో చేసే ప్రతి పని మనీతో రిలేట్ అయ్యి ఉంటుందని అజయ్ చెప్పుకొచ్చారు.

18 సంవత్సరాల వయస్సు తర్వాత ప్రొఫెషన్ నచ్చకపోతే ఆ పనిని వదిలేయడం బెస్ట్ అని తాను క్వాలిటీ వర్క్ చేయాలని అనుకుంటున్నానని అజయ్ చెప్పుకొచ్చారు.కెరీర్ మంచి యాక్టర్ గా ఎండ్ కావాలని అజయ్ పేర్కొన్నారు.

జీవితంలో సంతోషకరమైన మూవ్ మెంట్ పెద్ద కొడుకు పుట్టినప్పుడు అని వాళ్లతో టైమ్ స్పెండ్ చేయడం తనకు ఆనందాన్ని కలిగించిందని అజయ్ వెల్లడించారు.షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటానని నితిన్, రోహిత్ తనకు మంచి స్నేహితులని అజయ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ తప్ప నార్మల్ ఫ్రెండ్స్ లేరని అజయ్ అన్నారు.

Actor Ajay Shocking Comments About His Remuneration, Actor Ajay, Ntr, Nithin, Aj
Advertisement
Actor Ajay Shocking Comments About His Remuneration, Actor Ajay, Ntr, Nithin, Aj

పారితోషికం విషయంలో తాను ఫ్లెక్సిబుల్ గా ఉంటానని అజయ్ పేర్కొన్నారు.ఇండస్ట్రీ ఎంత పారితోషికానికి అర్హులో తెలియజేస్తుందని తనకు ఆ పాత్రను బట్టి రెమ్యునరేషన్ ఇస్తారు అని తాను 5,00,000 రూపాయలు కావాలని అడిగితే ఇవ్వరని 50,000 రూపాయలకు అర్హత ఉంటే 50,000 మాత్రమే ఇస్తారని అజయ్ అన్నారు.ఇండస్ట్రీ ఎంత ఇవ్వాలో అంత ఇస్తుందని అంతకు మించి రూపాయి కూడా ఎక్కువ రాదని అజయ్ అన్నారు.

Actor Ajay Shocking Comments About His Remuneration, Actor Ajay, Ntr, Nithin, Aj

జూనియర్ ఎన్టీఆర్ కూడా తనకు మంచి స్నేహితుడని తారక్ బ్రెయిన్ బ్యూటిఫుల్ బ్రెయిన్ అని అజయ్ తెలిపారు.ఒక విషయాన్ని తను చూసే విధానం అమేజింగ్ గా ఉంటుందని అజయ్ చెప్పుకొచ్చారు.స్టూడెంట్ నంబర్ 1 సమయంలో రాజీవ్, శేఖర్ తారక్ దృష్టిలో బాగా పడ్డారని అజయ్ అన్నారు.

ప్రస్తుతం తాను కెరీర్ విషయంలో ఫోకస్ తో ఉన్నానని అజయ్ వెల్లడించారు.రెమ్యునరేషన్ గురించి అజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు