తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అబివృద్ది కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు చేరుతున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అబివృద్ది కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ జిల్లా బేతోలు గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురికి పార్టీ కండువాలు కప్పి వారిని టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.సి.

ఎం.కేసీఆర్ దేశానికి పి.ఎం ఐతే రాజభోగాలతో తెలంగాణ రాష్ట్రం బంగారుమాయమవుతుందన్నారు.కేంద్రంలోవున్న బీజేపీ ప్రభుత్వం అటు రైతులను దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.

మేము ఎవ్వరిని కూడా బలవంతంగా పార్టీ లోకి చేర్చుకోవడం లేదని పార్టీ జనకర్షక పథకాల పట్ల ఆకర్షితులై టి ల్ఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నతన్నారు.

Advertisement
రజనీకాంత్ తెలుగు సినిమాల్లో నటించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు

తాజా వార్తలు