చూపు కోల్పోయిన యాసిడ్ బాధితురాలు... టెన్త్‌లో విజ‌యం సాధించిందిలా...

15 ఏళ్ల “కాఫీ” ( Kafi ) చండీగఢ్‌లోని బ్లైండ్ స్కూల్‌లో 10వ తరగతిలో అగ్రస్థానంలో నిలిచింది.కాఫీ.

యాసిడ్ దాడిలో( Acid Attack ) గాయ‌ప‌డి చివ‌రికి ప్రాణాలతో బయటపడింది.ఆమెకు మూడేళ్ల వయసు ఉన్న‌ప్పుడు హ‌ర్యానాలోని హిసార్‌లోని బుధానా గ్రామంలో ముగ్గురు వ్యక్తులు ఈర్ష్యతో చేసిన యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డింది.

ఈ కారణంగా ఆమె అంధురాలు అయ్యింది.ఆమె నోరు.

చేతులు బాగా కాలిపోయాయి.కానీ కాఫీ ప‌ట్టుద‌ల వదల్లేదు.

Advertisement

ఈ రోజు కాఫీ కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆమె విజ‌యం సాధించినందుకు గర్వపడుతున్నారు.కాఫీ 10వ తరగతిలో 95.20 శాతం స్కోర్ సాధించించింది.

తాను ఐఏఎస్ అధికారి కావాలనుకుంటున్నాన‌ని తెలిపింది.అయితే ఈ స్థాయికి చేరుకోవడంలో కాఫీ ప్రయాణం అంత సులభంగా సాగ‌లేదు.మీడియాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో కాఫీ మాట్లాడుతూ, తనకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు హోలీ రోజున, తన పొరుగున ఉంటున్న‌ ముగ్గురు వ్యక్తులు ద్వేషం కారణంగా తనపై యాసిడ్ పోశారని తెలిపింది.

ఇది 2011 వ సంవత్సరంలో జ‌రిగింద‌ని తెలిపింది.మొదట తన తండ్రి తనను ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స కోసం చేర్పించారని, వారం తర్వాత తాను జీవితాంతం అంధకారంలో ఉంటాన‌ని డాక్టర్ చెప్పారని కాఫీ తెలిపింది.

యాసిడ్ కార‌ణంగా ఆమె ముఖం మరియు చేతులు మొత్తం కాలిపోయాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

డాక్టర్ ఎలాగోలా ఆమెను కాపాడాడు కానీ కంటి చూపును కాపాడలేకపోయాడు.కాఫీ తిరిగి మాట్లాడుతూ.తన తండ్రి తనపై యాసిడ్ పోసిన‌ వ్యక్తుల‌పై న్యాయ‌ప‌పోరాటం చేశార‌ని కాఫీ తెలిపింది.

Advertisement

హిసార్ జిల్లా కోర్టు వారికి 2 సంవత్సరాల శిక్ష విధించింది.వారు శిక్షను పూర్తి చేసుకున్న‌ తర్వాత స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

ఇది వారి కుటుంబ సభ్యులను క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.త‌నకు 8 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, హిసార్ బ్లైండ్ స్కూల్‌లో( Hisar Blind School ) చదవడం ప్రారంభించాన‌ని కాఫీ తెలిపింది.

అయితే ఆ పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు చండీగఢ్ త‌ర‌లివ‌చ్చారు.

కాఫీ తండ్రి కాంట్రాక్ట్‌పై చండీగఢ్ సెక్రటేరియట్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్నారు.కాఫీ మొదటి నుండి చదువులో చాలా చురుకైన‌ది.ఫ‌లితంగా చండీగఢ్‌లోని సెక్టార్ 26 బ్లైండ్ స్కూల్‌లో నేరుగా ఆరవ తరగతిలో ప్రవేశం పొందింది.

కాఫీ తన ధైర్యాన్ని, ఆశను కోల్పోలేదని, అంత‌టి చీకట్లోనూ ఇంతటి చ‌దువుల జ్యోతిని వెలిగించింద‌ని, తల్లిదండ్రులకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింద‌ని కాఫీ తండ్రి పవన్ అన్నారు.నిందితులపై తాను 2017లో పంజాబ్ హర్యానా హైకోర్టులో అప్పీలు చేశానని, అయితే అప్పటి నుంచి అది పెండింగ్‌లో ఉందని, దానిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పవన్ పేర్కొన్నారు.

తాజా వార్తలు