పోలీస్ కస్టడీకి నవీన్ హత్య కేసు నిందితుడు..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‎మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసు నిందతుడికి పోలీస్ కస్టడీ విధించింది న్యాయస్థానం.

ఈ మేరకు నిందితుడు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

ఇవాళ్టి నుంచి ఈనెల 10 వరకు హరిహరకృష్ణను అబ్దుల్లాపూర్‎మెట్ పోలీసులు విచారించనున్నారు.హరిహరకృష్ణకు ఇంకా ఎవరైన సహకరించారా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.

సీన్ రీకన్‎స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు.అదేవిధంగా హరిహరకృష్ణ స్నేహితులు, కుటుంబ సభ్యులనూ పోలీసులు ప్రశ్నించనున్నారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు