ఇండియాలో రిలీజైన కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రూ.10తో 40 కి.మీ వెళ్లొచ్చు..

ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ రోజురోజుకూ పెరుగుతున్నందున సరికొత్త కంపెనీలు అదిరిపోయే ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.తాజాగా అబ్జో (ABZO) మోటార్స్ అనే కొత్త కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ABZO VS01ని విడుదల చేసింది.

ఈ మోటార్‌సైకిల్ ధర రూ.1.80 లక్షలతో మొదలై రూ.2.22 లక్షల వరకు ఉంటుంది.అబ్జో VS01 బైక్ 72V 70 Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

అబ్జో VS01 రెట్రో-స్టైల్ క్రూయిజర్( Retro Style Cruiser ) డిజైన్‌ను కలిగి ఉంది.ఇది ఇంపీరియల్ రెడ్, మౌంటైన్ వైట్, జార్జియన్ బే, బ్లాక్ అనే నాలుగు విభిన్న రంగులలో లభిస్తుంది.

ఇందులో LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్స్‌, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్( Alloy Wheels ) వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.ఈ మోటార్‌సైకిల్ వీల్‌బేస్ 1,473 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 158 మిమీ, సీటు ఎత్తు 700 మిమీ.

ఈ సైజుల వల్ల ఈ బైక్ అన్ని ప్రాంతాల్లో నడపడానికి, అందరూ రైడర్లు రైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది.

Advertisement

అబ్జో VS01 8.44 bhp గరిష్ట శక్తిని, 190 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

ఈ మూడు రైడింగ్ మోడ్‌లలో 45 km/h, 65 km/h, 85 km/h వేగంతో దూసుకెళ్లవచ్చు.ఈ మోటార్‌సైకిల్‌ ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 180 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

ఇది రీజెనరేటివ్ బ్రేకింగ్‌తో( Regenerative Braking ) వస్తుంది కాబట్టి బ్రేక్ చేసినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.

సాధారణ ఛార్జర్‌ని ఉపయోగించి 6 గంటల 35 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేయవచ్చు.ఫాస్ట్ ఛార్జర్‌తో 3 గంటల 20 నిమిషాల్లో ఫుల్‌గా ఛార్జ్ చేయవచ్చు.మోటార్‌సైకిల్‌లో సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్(CBS)తో ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.ఇది సులభంగా పార్కింగ్ చేయడానికి రివర్స్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

Advertisement

భారత్‌లో దశలవారీగా ABZO VS01ని విడుదల చేస్తామని ABZO మోటార్స్ సహ వ్యవస్థాపకుడు కంచి పటేల్ తెలిపారు.కంపెనీ చెప్పిన ప్రకారం పది రూపాయల ఖర్చుతో దీనిపై 40 కిలోమీటర్లు వెళ్లవచ్చు.

తాజా వార్తలు