అబ్బే ' కారు ' స్పీడ్ అనుకున్నట్టుగా లేదే ..? 

ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే వ్యూహంతో పాటు, బిజెపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసేందుకు దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక పార్టీలన్నిటిని ఏకం చేసి వారి మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి రావాలని కెసిఆర్ ఆశలు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోని జాతీయ పార్టీని ఆయన స్థాపించారు.దేశవ్యాప్తంగా తమకు అనుకూలంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ,అక్కడే బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి బిజెపికి అధికారం దక్కకుండా చేయాలని చూస్తున్నారు.

అయితే ఆశించిన స్థాయిలో అయితే బీఆర్ఎస్ విస్తరణ, ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో మద్దతు కరువు అవుతున్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది.గతంలో కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో అంత ఆసక్తిగా లేకపోవడం కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తోంది.

వివిధ రాష్ట్రాల్లో పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు,  రాష్ట్ర శాఖలను ఏర్పాటు చేయాలని చూసినా ఇప్పుడు అక్కడ పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు.

Advertisement

  ఎవరు పార్టీ తరఫున పని చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదట.వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యవర్గాలను నియమించుకునేందుకు బలమైన నాయకులెవరు ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారిందట.దీంతో కేసీఆర్ కాస్త నిరాశ చెందుతున్నట్టుగానే కనిపిస్తున్నట్లు బిఆర్ఎస్ లోని కొంతమంది కీలక నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

కేసిఆర్ ఢిల్లీ కేంద్రంగా మఖం వేసి అక్కడి నుంచే బీఆర్ఎస్  దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.అలాగే కిసాన్ సెల్ పార్టీ తరఫున ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

అలాగే జాతీయస్థాయిలో భారీ బహిరంగ సభను రైతులతో కలిసి నిర్వహించేందుకు ఒకపక్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  కానీ ఆశించిన స్థాయిలో బిఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడకపోవడం కెసిఆర్ కు ఆ పార్టీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు