AB De Villiers T20WC Final: T20 వరల్డ్ కప్ విజేత ఎవరో తెలిసిపోయింది! AB డి విలియర్స్ చెప్పిన జాతకం ఇదే?

ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ వచ్చిన వరల్డ్ కప్ చివరి దశకి చేరుకున్న విషయం తెలిసిందే.

కాగా నేడు రేపు 2 సెమి ఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయ్.

సెమి ఫైనల్ మ్యాచ్లు ముగిసిన తరువాత అక్టోబర్ 13వ తేదీన ఫైనల్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా జరగబోతుంది.ఇలాంటి తరుణంలో ఎవరికి నచ్చిన ఊహాగానాలు వారు చేస్తున్నారు.

ఇపుడు సెమి ఫైనల్లో గెలిచిన 2 జట్లు ఫైనల్ లో అడుగుపెడతాయి.అక్టోబర్ 13వ తేదీన జరగబోయే ఫైనల్ పోరులో హోరాహోరీగా తలబడి విశ్వ విజేతగా ఒకరు నిలుస్తారు.

అయితే వరల్డ్ కప్ చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఈ ఏడాది T20 వరల్డ్ కప్ విజేతగా నిలవబోయే జట్టు ఏది అన్న విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియాలో ఇచ్చేస్తున్నారు.ఈ రివ్యూలు కాస్త జనాల్లో కూడా అంచనాలను పెంచేస్తూ ఉన్నాయి.

Advertisement

ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు AB డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.అతగాడు మాట్లాడుతూ.

"ఈ సంవత్సరం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న T20 వరల్డ్ కప్ లో ఖచ్చితంగా భారత జట్టునే విజేతగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు!" అని జోష్యం చెప్పాడు.

తాజాగా ఓ క్రీడా చానల్ తో మాట్లాడిన AB డివిలియర్స్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇంకా ఆయన మాట్లాడుతూ.మేల్బోర్న్ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడే అవకాశం మెండుగా వుంది అని అంచనా వేశాడు.

టీమ్ ఇండియాలో చాలా ప్రతిభవంతులైన ఆటగాళ్లు వున్నారని, అందరూ మంచి ఫామ్ లో వున్నారని, ఇరగదీస్తారని అన్నాడు.ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ విరుచుకుపడతారని ధీమా వ్యక్తం చేసాడు.

నూతన సంవత్సరం ఎర్రటి కాగితంపై ఇలా రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది!
Advertisement

తాజా వార్తలు