ఎన్టీఆర్ కోసం అమీర్ ఖాన్.. నీల్ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం 2000 కోట్లు పక్కా!

తెలుగు ప్రేక్షకులకు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు నీల్.

ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో సినిమాను సలార్ తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ కి పోటీగా పృథ్వీరాజ్ సుకుమారన్ ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

సలార్ పై భారీగా క్రేజ్ ని పెంచారు.పార్ట్ 1 లో పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రభాస్ లను దోస్త్ లుగా చూపించి పార్ట్ 2 లో అసలు సిసలు యాక్షన్ చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్.

Aamir Khan To Star Alongside Jr Ntr In Ntr 31 Details, Ntr, Tollywood, Aamir Kha

ఇకపోతే ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా ఎన్టీఆర్ తో( NTR ) చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ ప్రాజెక్టులోకి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో ని ఎన్టీఆర్ కి ఆపోజిట్ గా విలన్ గా తీసుకురాబోతున్నారు అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ స్టార్ హీరో మరెవరో కాదండోయ్ అమీర్ ఖాన్.

Advertisement
Aamir Khan To Star Alongside Jr NTR In NTR 31 Details, Ntr, Tollywood, Aamir Kha

( Aamir Khan ) ఎన్టీఆర్ తో పోటీపడాలంటే బాలీవుడ్ నుంచి స్టార్ హీరో దిగాల్సిందే అని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యారట.ఎన్టీఆర్ తో సరిసమానమైన నెగిటివ్ పాత్రకు బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ సరిపోతాడని భావిస్తున్నారట ప్రశాంత్ నీల్.

Aamir Khan To Star Alongside Jr Ntr In Ntr 31 Details, Ntr, Tollywood, Aamir Kha

మరి ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని దించడం అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో తెరకెక్కుతుందో అర్ధమవుతోంది.ఇక హీరోయిన్ గా కూడా ప్రశాంత్ నీల్ బాలీవుడ్ భామని దించాలని ట్రై చేస్తున్నారట.అయితే హీరోయిన్ గా రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) నటిస్తోందంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

మొత్తంగా చూస్తే ఈ సినిమాను సలార్ ను మించి రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ ఇదే గనుక జరిగితే 2000 కోట్లు రాబట్టడం పక్క అని చెప్పాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు