ఆమీర్ ఖాన్ - రాజమౌళి ... ఇద్దరిలో ఎవరు గొప్ప? ?

మిస్టర్ పెర్ఫక్షనిష్ట్ ఆమీర్ ఖాన్ .మన దేశంలో మొదటి 100 కోట్ల నెట్ సినిమా, మొదటి 200 కోట్లు, మొదటి 300 కోట్లు, మొదటి 200,300,400,500,600,700 కోట్ల గ్రాస్ .

అన్ని రికార్డులు ఆయనవే.దశాబ్దకాలం క్రిదం మొదలైన ఈ రికార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఖాన్ త్రయంలో మిగిలిన ఇద్దరు షారుక్, సల్మాన్ కూడా ఆమీర్ దరిదాపుల్లో లేరు.ఇలాంటి ఏకచత్రాధిపత్యం నడుస్తున్న సమయంలో జక్కన్న బాహుబలి అంటూ ఛాలెంజ్ విసిరాడు.

మొదటిభాగంతో భయపెట్టాడు, రెండొవభాగంతో బద్దలుకొట్టాడు.కాని ఓటిమి ఒప్పుకోని ఆమీర్ దంగల్ చైనా కలెక్షన్లతో బాహుబలి 2 దగ్గరికొస్తున్నాడు.

Advertisement

మరి ఇద్దరిలో ఎవరు గొప్ప? దంగల్ బడ్జెట్ 70 కోట్లు.సినిమాలో ఆమీర్ ఒక 54-55 ఏళ్ళ ముసలివాడు.

తనకి హీరోయిన్ ఉండదు.ఒక భార్య పాత్ర ఉంటుంది.

పోని తను మల్లయుద్ధం చేస్తూ కనిపిస్తాడా అంటే అది కొద్దిసేపే.తన ఇద్దరు కూతుర్లకి గురువులా ఉంటాడు.

అమ్మాయిలే ఆటలో పోరడాతారు, గెలుస్తారు.కాని ఆమీర్ తన కూతుళ్ళ కోసం ప్రపంచంతో పోరాడతాడు, పురుషాధిక్య సమాజానికి ఎదరుగా నిలుస్తాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
న్యూస్ రౌండప్ టాప్ 20 

అంత అద్భుతమైన కథ కాబట్టే, దంగల్ చైనాలో 500 కోట్ల చేరువలో ఉంది.మొత్తం మీద 1300 కోట్ల దాకా వసూలు చేసి బాహుబలి సాధించిన 1500 కోట్ల కలెక్షన్లలకి దగ్గరగా వెళుతోంది.

Advertisement

బాహుబలి 2 బడ్జెట్ 200 కోట్ల పైమాటే.మనం ఇప్పటివరకు చూడని గ్రాఫిక్స్, భారీ సెట్లు, పార్ట్ 1 హైప్, యాక్షన్ సన్నివేశాలు, హీరోయిజం .ఇలా అన్ని ప్రేక్షకులకి వడ్డించి 1600 కోట్ల వైపు దూసుకెళుతున్నాడు జక్కన్న.ఇప్పుడు చెప్పండి ఇద్దరిలో ఎవరు గొప్ప? కలెక్షనల్ పరంగా బాహుబలి పైస్థానంలో ఉన్నా, లాభాల పరంగా దంగల్ ని ఇప్పట్లో అందుకోవడం బాహుబలికి సాధ్యపడే విషయం కాదు.అంతమాత్రాన రాజమౌళి గొప్పతనం తగ్గలేదు.

ఆమీర్ , రాజమౌళి .ఇద్దరు ఇద్దరే.మనకు సామాజిక అంశాలున్న గొప్ప కథలు కావాలి, కథని గొప్పగా చెప్పే టెక్నికల్ వాల్యూస్ కూడా కావాలి.

మెదడుని ఆలోజింపచేసే ఆమీర్ సినిమాలు కావాలి, అలాగే ఎమోషన్స్ తో పిండేసే రాజమౌళి సినిమాలు కూడా కావాలి.తెలుగు, హిందీ తేడాలు వదిలేస్తే .ఈ ఇద్దరు మన భారతీయ చలనచిత్రాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.కాబట్టి ఇద్దరు గొప్పే.

తాజా వార్తలు