సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సూర్య( Surya ) ఇక అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కూడా కంగువ అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్( Bollywood ) జనులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

ఇక ముఖ్యంగా అమీర్ ఖాన్ అయితే ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా కనక సక్సెస్ అయితే తను నెక్స్ట్ శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్లు పెద్దగా మ్యాజిక్ చేయట్లేదు.

Aamir Khan Focused On Surya Kanguva Movie What Is The Reason , Tamil Movie , Su

కాబట్టి బాలీవుడ్ స్టార్ హీరోలందరూ చిన్న డైరెక్టర్ల పైన విరుచుకు పడుతున్నారు.మరి ముఖ్యంగా తెలుగు, తమిళ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే అమీర్ ఖాన్ తో ఇప్పుడు సినిమాలు చేయడానికి తెలుగు దర్శకులు ఎవరు కూడా ఖాళీగా లేరు.

Advertisement
Aamir Khan Focused On Surya Kanguva Movie What Is The Reason , Tamil Movie , Su

కాబట్టి తను శివ డైరెక్షన్( Siva Direction ) లో ఒక వైవిధ్యమైన కథాంశం తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి అమీర్ ఖాన్ అనుకున్నట్టుగానే ఆ సినిమా హిట్ అయి శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

Aamir Khan Focused On Surya Kanguva Movie What Is The Reason , Tamil Movie , Su

ఇక అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో( Dangal movie ) భారీ సక్సెస్ ని సాధించాడు.ఇక ఆ తర్వాత వచ్చిన లాల్ సింగ్ ఛద్దా భారీ డిజాస్టర్ అయింది.ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఎలాంటి సినిమా చేయాలన్న దానిపైన కసరత్తులు చేస్తున్నాడు.

ఇక ఇప్పటి వరకు మరో సినిమా కూడా అనౌన్స్ చేయలేదు.కాబట్టి ఇప్పుడు చేయబోయే సినిమాతో సూపర్ హిట్ కొట్టలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితేనే మళ్లీ అమీర్ ఖాన్ నిలబడతాడు లేకపోతే మాత్రం అమీర్ ఖాన్ మార్కెట్ పూర్తిగా పడిపోతుందనే చెప్పాలి.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు