పాన్ ఇండియా చిత్రాలకు కారణమే రాజమౌళి.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25 న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే దుబాయ్ లో మొదలైన ఈ సినిమా ప్రమోషన్, ఆ తర్వాత కర్ణాటకలో జరిగాయి.ఇకపోతే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా పర్యటనలో ఉన్నారు.

ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ ఏ సినిమాకు లేని విధంగా ప్రమోషన్స్ ను హోరెత్తిస్తున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం ఆర్ఆర్ఆర్ టీం ఢిల్లీలో సందడి చేసింది.

ఢిల్లీలోని పీవీఆర్‌ఆర్‌ఆర్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొంది.ఇక ఈ కార్యక్రమానికి మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Advertisement

ఈ వేడుకల్లో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.దర్శకుడు రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపించారు.

దర్శకుడు రాజమౌళి కారణంగానే ప్రస్తుతం సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి అని రాజమౌళిని పొగిడారు.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో భారతీయ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు అంటూ రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు అమీర్ ఖాన్.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నానని చెప్పుకొచ్చారు అమీర్‌.ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ లకు,పాట లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని తారక్ చెర్రీ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

ఇక అభిమానుల అంచనాల మేరకు ఈ సినిమా హిట్ అవుతుందా,అలాగే అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా తెలియాలి అంటే మార్చి 25 వరకు వేచి చూడాల్సిందే మరి.ఈ సినిమా విడుదల కావడానికి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో అభిమానులు కటౌట్లను భారీగా ఏర్పాటు చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు