దేవుడా, చేప నోట్లో మనిషి పళ్లు.. చూసి పరుగులు తీసిన యువతి!

ఈ ప్రపంచంలో ఎన్నో వింత జంతువులు ఉన్నాయి.సముద్రాలే వాటికి నిలయాలు.

ఇవి వింతగా ఉండటమే కాకుండా ఒక్కొక్కసారి వింత భౌతిక లక్షణాలతో ఆశ్చర్యపరుస్తుంటాయి.

తాజాగా బ్రెజిలియన్ మహిళ (Brazilian woman)పౌలా మోరిరా ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వింత చేప వీడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఆమె కనుగొన్న ఓ వింత చేప ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారింది.మనిషి దంతాలను(Mans teeth) పోలిన పళ్లతో ఉన్న ఆ చేపను చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది.

అంచియేటాలోని పోర్టో వెల్హో బీచ్‌లో(Velho Beach) వెకేషన్‌కు వెళ్లిన పౌలా, అక్కడి గ్రిల్ మీద ఈ వింత ఆకారం కలిగిన చేపను చూసింది.దాని వింత రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆమె వెంటనే వీడియో తీసి ఆన్‌లైన్‌లో షేర్ చేయగా, అది క్షణాల్లో మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అయింది.

Advertisement

వీడియోలో పౌలా ఆ చేప నోటిని పరిశీలిస్తూ కనిపించింది.ఆమె దాని పెదాలను కదిలించి చూడగా, చిగుళ్లలో అమర్చినట్టుగా ఉన్న మనిషి దంతాలను పోలిన పూర్తి వరుస పళ్లు కనిపించాయి.

ఆ వింతను అందరికీ స్పష్టంగా చూపించేందుకు ఆమె దాని నోటిని వెడల్పుగా తెరిచింది.వీడియో తీస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) తన ఫాలోవర్స్‌ను "ఈ చేప ఏ రకమైనదో ఎవరికైనా తెలుసా?" అని అడిగింది.

ఆ చేపను మొదటిసారి చూసినప్పుడు తాను షాక్‌కు గురైనట్టు, అలాగే నవ్వొచ్చిందని పౌలా చెప్పింది."నేను మా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాను.ముఖ్యంగా అల్జీమర్స్ (Alzheimers)వ్యాధితో బాధపడుతున్న మా అమ్మమ్మ కూడా మాతో ఉంది.

ఆ చేపను చూడగానే అది చాలా వింతగా, ఫన్నీగా అనిపించడంతో నేను గట్టిగా అరిచాను.పరుగులు కూడా తీశాను." అని ఆమె వివరించింది.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

డిసెంబర్ 31న బీచ్‌లో ఉన్నప్పుడు పౌలా, తన కుటుంబ సభ్యులు ఆ చేపతో పాటు మరో రెండు చేపలను కొనుగోలు చేశారు.అయితే వాటిని వండటానికి సిద్ధం చేస్తున్న సమయంలోనే అది ఎంత వింతగా ఉందో వారు గ్రహించారు.

Advertisement

పౌలా మేనమామ ఆ చేపకు ఉప్పు, కారం పట్టించి గ్రిల్ చేశాడు.పౌలా స్వయంగా తినకపోయినా, సీఫుడ్ అంటే ఇష్టపడే ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఆ చేప చాలా రుచిగా ఉందని చెప్పారు.

మనిషి దంతాలను పోలిన పళ్లతో ఉన్న ఈ చేప వీడియో ఆన్‌లైన్‌లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.ఈ వింత జాతి చేప గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.

ఈ వీడియోను ఇప్పటివరకు 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

తాజా వార్తలు