ఏందయ్యా ఇది.. పట్టపగలే గ్యాస్ కట్టర్‌తో సైకిల్ దొంగతనం చేసిన యువకుడు..

ఈరోజుల్లో దొంగలు రెచ్చిపోతున్నారు.ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా దొంగలు అందరూ చూస్తుండగానే చోరీలకు తెగబడుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కి గురి చేస్తున్నాయి.తాజాగా ఆ కోవకి చెందిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

@Crazyclipsonly ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే ఆరు లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.

ఇద్దరు వ్యక్తులు పట్టపగలే ఒక ఇనుప రాడ్‌కి లాక్ వేసిన సైకిల్‌ను దొంగలించడం మనం చూడవచ్చు.వారు ఒక గ్యాస్ కట్టర్ తెచ్చుకొని అందరూ చూస్తుండగానే లాక్‌ను కట్ చేశారు.ఈ దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేస్తూ అది నీ బైక్ ఏనా అని అడిగాడు.

Advertisement

అప్పుడు ఏంటి అని దొంగ ఎదురు తిరిగి ప్రశ్నించాడు.అనంతరం లాక్ కట్ చేస్తూ చివరికి సైకిల్‌ను విడిపించుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు ఓనర్ వస్తాడేమో అని కొంచెం భయం కూడా పడ్డాడు.

పట్టపగలే దొంగతనం జరుగుతూ ఉంటే ఎవరూ కూడా పోలీసులకు కాల్ చేయకపోవడం నిజంగా విస్తు గొలిపే అంశం.బైక్స్ ఈ రోజుల్లో ఎక్కువగా దొంగతనానికి గురవుతున్నాయని మరికొందరు పేర్కొన్నారు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటిని కాసేపు బయట వదిలేస్తే చాలు తర్వాత మటు మాయమవుతున్నాయని మరికొందరు అన్నారు.ప్రజలు ఏమాత్రం స్పందించకపోవడం చాలా షాకింగ్ గా అనిపిస్తుందని మరికొందరు ఉన్నారు.నేరాలు జరుగుతున్న ఎలా సైలెంట్ గా ఉంటే నేరగాళ్లు( Criminals ) ఇంకా రెచ్చిపోతారని మరికొందరి పేర్కొన్నారు.

మొత్తం మీద ఈ వీడియో చాలా మందిలో ఆందోళన కలిగించింది.దీనిని మీరు కూడా చూసేయండి.

సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు