సంగమేశ్వరంలో అద్భుత దృశ్యం.. హర హర మహాదేవ అంటూ పరవశించిన భక్తులు..!

మన భారత దేశంలో ఎన్నో పురాతనమైన పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి.

ఈ దేవాలయాలకు ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి భగవంతునికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

ఆ దేశంలోని కొన్ని పవిత్రమైన దేవాలయాలలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలను భక్తులు చూస్తూ ఉంటారు.అలాగే సంగమేశ్వరంలో( Sangameswaram ) ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో కృష్ణ నది మారడం భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే సప్త నదుల సంగమం మన సంగమేశ్వరం.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న సంగమేశ్వరంలో అద్భుతం చోటుచేసుకుంది.

కృష్ణా నదిలో నీటిమట్టం తగ్గిపోవడంతో భీమలింగం( Bhimalingam ) ఉండే ప్రాంతంలో నీరు పని మట్టం ఆకారంలో దర్శనమిచ్చింది.అక్కడ ఉన్న శివలింగం, నీటి ఆకారం చూడడానికి ఒకేలా కనిపించడం మహా అద్భుతం అని భక్తులు చెబుతున్నారు.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే సంగమేశ్వరంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక అద్భుతం వెలుగు చూస్తూనే ఉంటుంది.

గత సంవత్సరం నీళ్లు తగ్గే సమయంలో పాము,పిల్లి ఆకారం గాని కనిపిస్తూ ఉంటుంది.ఇప్పుడు పాణిమట్టం ఆకారంలో దర్శనం ఇవ్వడంతో భక్తులు పరవశంలో ఉన్నారు.మరో ఆరు అడుగుల మేర నీటిమట్టం తగ్గితే భీమ లింగం బయటపడుతుందని పురోహితులు చెబుతున్నారు.

మరో వైపు సంగమేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడానికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సాంబశివ నాయుడు దంపతులు దర్శించుకున్నారు.ఈ దంపతులకు దేవాలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

చైత్ర శుక్ల ఏకాదశి శనివారం కావడంతో సంగమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించారు.ఆ తర్వాత కృష్ణా నది గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు పసుపును అస్సలు తినకూడదు.. తింటే మాత్రం..!

వీరి వెంట నాగర్ కర్నూల్, కొల్లాపూర్ జడ్జిలు, న్యాయశాఖ సిబ్బంది కూడా దేవాలయ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే నల్ల మల్ల ప్రాంతం కావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు