Nishkalank Temple Gujarat : సముద్ర గర్భంలో దేవాలయం.. తడవకుండానే దర్శనం చేసుకోవచ్చా..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాల అన్నిటికి ప్రతిరోజు భక్తులు వచ్చి పూజలు, హోమాలు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు.

కొన్ని ఆలయాలు భక్తులు వెళ్లలేని ప్రదేశాలలో కూడా ఉన్నాయి.అలాంటి ఆలయాలలో కొన్ని ఆలయాలు పర్వత ప్రాంతాలలో, నదులకు సమీపంలో ప్రకృతి అందాల మధ్య ఉన్నాయి.

కానీ ఒక దేవాలయం మాత్రం సముద్రంలో ఉంది.ఇంతకీ సముద్రం మధ్యలో ఉండే దేవాలయం ప్రాముఖ్యత ఏమిటో, ఆ దేవాలయాన్ని సముద్రంలో ఎవరు నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం.

నిష్కలంక్ దేవాలయం ఇది గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా మహాసముద్ర తీరంలో కొలియాక్ గ్రామంలో ఉంది.పురాణాల ప్రకారం ఈ దేవాలయాన్ని పాండవులు మహాభారత యుద్ధం తర్వాత వారి దోషాలను, కలంకాలను తొలగించుకోవడానికి నిర్మించాలని చరిత్రలో ఉంది.

Advertisement
A Temple In The Womb Of The Sea Can You Visit It Without Getting Wet , Temple, B

ఈ దేవాలయానికి భక్తులు రావడానికి ఉదయం 11 గంటల నుండి దర్శనం మొదలవుతుంది.ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి సముద్ర అలలు కాస్త కాస్త జరుగుతూ మూడు కిలోమీటర్ల మీరు వెనక్కి తగ్గుతాయి.

దేవాలయంలోని ఒక జెండాతో స్థూపం ఐదు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి.తిరిగి సాయంత్రం ఏడు గంటల వరకు సముద్రుడు ఆలయాన్ని ముంచి వేస్తాడు.

పురాణాల ప్రకారం మహాభారత యుద్ధంలో పాండవులు దయాదులను చంపిన పాపం వారికి చుట్టుకుంటుందని కృష్ణుడిని శరణు కోరుతారు.

A Temple In The Womb Of The Sea Can You Visit It Without Getting Wet , Temple, B

అప్పుడు పాండవులను కృష్ణుడు ఏం చెప్పాడంటే ఒక నల్లని ఆవుకు నల్లని జెండా కట్టి ఎక్కడైతే ఆవు, జెండా రంగులు తెల్లగా మారుతాయో అప్పుడు దయాధులను చంపిన పాపం నుంచి పాండవులు విముక్తులు అవుతారని ఉపదేశిస్తాడు.కృష్ణుని మాటలు విన్న పాండవులు చాలా రోజుల వరకు ఆవు వెంట నడుస్తూ వెళ్లి సరిగ్గా అరేబియా సముద్ర తీరం కొలియాక్ గ్రామం సమీపానికి చేరుకోగానే ఆవు, జెండా రెండు తెల్లగా మారిపోతాయి.దాంతో పాండవులు శివయ్యను జపిస్తూ ఘోర తపస్సు చేస్తారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

అప్పుడు ఆ పరమశివుడు ఐదు స్వయంభు లింగాలుగా అవతరిస్తాడు.వెంటనే పాండవులు ఆ లింగాలకు అభిషేకాలు, పూజలు చేసి దేవాలయాన్ని నిర్మిస్తారు.

Advertisement

తాజా వార్తలు