మేడిగడ్డకు నిపుణుల బృందం.. బ్యారేజ్ గేట్ల ఎత్తివేతకు ఏర్పాట్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Bhupalpally )లోని మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) ను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం సందర్శించింది.

ఈ క్రమంలో బ్యారేజ్ మరమ్మత్తుల పనుల గురించి నిపుణుల బృందం కీలక సూచనలు ఇవ్వనుంది.

మేడిగడ్డ బ్యారేజ్ లో డ్యామేజ్ అయిన 17, 18వ గేట్లను నిపుణులు ఎత్తనున్నారు.దీంతో నిపుణుల సమక్షంలో గేట్లను ఎత్తేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ మేరకు సిల్ బీమ్స్, వాల్ ప్లేట్లతో పాటు గర్డర్ లను సిబ్బంది క్లీన్ చేశారు.అదేవిధంగా వరదలకు అడ్డంకి లేకుండా ఉండేందుకు గేట్లను ఎత్తాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు( Dam Safety Officers) కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో మొత్తం గేట్లను నిర్మాణ సంస్థ ఎత్తనుంది.

Advertisement
ఏపీకి అమరావతి రాజధాని మాత్రమే కాదు అంటూ చంద్రబాబు సంచలన పోస్ట్..!!

తాజా వార్తలు