సినిమా ఇండస్ట్రీ లో ఉన్న పెద్ద హీరోలు ఎప్పుడైనా చిన్న ఆర్టిస్ట్ ల గురించి ఆలోచిస్తూ ఉంటారు.
ఎందుకంటే వాళ్లు మాత్రమే కాకుండా చిన్న ఆర్టిస్టులు కూడా బతకాలి అని కోరుకుంటారు.
కాబట్టే వాళ్ల స్థాయి మేరకు వాళ్ళు బాగా నటించి మంచి నటన ని కనబర్చి మంచి స్థాయి లో ఉండాలని కోరుకుంటున్నారు.నిజానికి వీళ్ళందరూ చిన్న ఆర్టిస్ట్ ల పైన మంచి భావాన్ని కలిగి ఉంటారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రజినీకాంత్ ( Rajinikanth )రీసెంట్ గా చేసిన జైలర్ సినిమా( Jailer ) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా రజినీకాంత్ కెరియర్ లోనే సూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా లో రజినీకాంత్ పక్కన నటించిన కొంత మంది నటుల్లో ఒకరు సరిగ్గా నటించలేదట అయితే రెండు రోజుల షూటింగ్ జరుపుకున్న తరువాత డైరెక్టర్ కి ఆ ఆర్టిస్ట్ చేసిన పర్ఫామెన్స్ నచ్చకపోవడంతో ఆయన్ని తీసివేసి ఆయన ప్లేస్ లో డైరెక్టర్ ఇంకో ఆర్టిస్ట్ ని పెడుదాం అని చెప్పాడట ఇక అప్పుడు రజినీకాంత్ ఆయన మన సినిమాలో చేస్తున్నాడు అని వాళ్ల ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి ఉంటాడు కాబట్టి ఆయన్ని ఇలా తీసివెస్తే వాళ్ళతో ఏం చెప్తాడు అలా తీసేయడం కరెక్ట్ కాదు అని రజినీకాంత్ ఆ సినిమా డైరెక్టర్ అయిన నెల్సన్ తో చెప్పడం తో అతన్ని మళ్లీ ఈ సినిమా లోకి తీసుకున్నాడట.ఇలా రజినీకాంత్ లాంటి ఒక గొప్ప నటుడు,హీరో అయిన ఆయన వాళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు కూడా బాగుండాలి అని చెప్పి తన ఉన్నతమైన గుణాన్ని చాటుకున్నాడు.
ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్ లని కూడా బ్రేక్ చేసింది అనే చెప్పాలి.ఇక ఈ సినిమా తో ఒక్కసారి గా రజినీకాంత్ ఇండస్ట్రీ లో తనకు ఉన్న పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు అనే చెప్పాలి.నిజానికి ఈ సినిమా తో రజినీకాంత్ అంటే ఏమిటో ఒకసారి ఈ జనరేషన్ కుర్రాళ్ళకి కూడా తెలిసేలా చేశాడు అంటే రజినీకాంత్ ని మనం కిర్తించకుండా ఉండలేము.
ఇక రజినీకాంత్ ఇప్పుడు తమిళ్ టాప్ డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్( Karthik Subbaraj ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నడు అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy