మంచి మనసు చాటుకున్న స్టార్ కిడ్... ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ?

సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సెలెబ్రిటీల పిల్లలు బయట ఎక్కడైనా కనపడితే పెద్ద ఎత్తున వారిని మీడియా వారితో పాటు కొందరు బెగ్గర్స్ కూడా చుట్టుముడుతూ ఉంటారు కానీ సెలబ్రిటీల పిల్లలు బెగ్గర్స్ ని ఆమడ దూరం పెడుతూ వెళ్లిపోవడమే కాకుండా కొందరు వారి పట్ల కాస్త కఠినంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఈ స్టార్ కిడ్ మాత్రం బెగ్గర్స్ పట్ల ఎంతో మంచి మనసు చాటుకున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షారుక్ ఖాన్ ( Shahrukh Khan ) గురించి చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ( Suhana Khan ) అందరికీ ఎంత సుపరిచితమే.

సుహానా అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి బయట పార్టీలకు వెళ్లడం రెస్టారెంట్లకు వెళ్లడం ఇతర కార్యక్రమాలకు వెళ్లి సందడి చేయడం వంటివి చేస్తుంటారు.ఈ క్రమంలోనే సుహానా ఖాన్ తన తల్లి గౌరీ ఖాన్( Gauri Khan ) తో కలసి ముంబై నగరంలోని జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమం అనంతరం సుహానా ఖాన్ బయటకు వస్తున్నటువంటి తరుణంలో ఒక పేద మహిళ తనకు సహాయం చేయాలని కోరారు.

అయితే ఆమె అడిగిన వెంటనే సుహాన ఏమాత్రం ఆలోచించకుండా తన బ్యాగ్ నుంచి ఏకంగా 500 రూపాయల నోటు తీసి తన చేతిలో పెట్టింది.అయితే ఆ మహిళ మరోసారి తనని డబ్బు అడగడంతో సుహానా మరొక 500 రూపాయల నోటును తన చేతిలో పెట్టింది.

Advertisement

ఈ విధంగా పేద మహిళ పట్ల తన మంచి మనసును చాటుకుంటూ తనకు ఏకంగా వెయ్యి రూపాయలు ఇవ్వడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సుహాన మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక సుహానా సినిమాల విషయానికి వస్తే.ఈమె జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ది అర్చీస్ ద్వారా త్వరలో ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఈ ఏడాది చివరల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement

తాజా వార్తలు