ఇండియాకి అరుదైన గౌరవం.. గ్రేటెస్ట్ ప్లేసెస్‌లో భారతదేశానికి సెకండ్ ప్లేస్..!

భారతదేశంలోని రెండు ప్రదేశాలకు అరుదైన గౌరవం దక్కింది.అహ్మదాబాద్, కేరళను టైమ్ మ్యాగజైన్ అత్యుత్తమ ప్రదేశాలుగా అభివర్ణించింది.

2022కి సంబంధించి ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో 50 ప్రదేశాలను చేర్చింది.ఇందులో అహ్మదాబాద్, కేరళ స్థానాలను సంపాదించాయి.

పర్యటించడానికి ప్రపంచంలో ఏ ప్రాంతాలు గొప్పవి, అత్యుత్తమమైనవి అనే కోణంలో టైమ్ మ్యాగజైన్ తన అన్వేషణ మొదలు పెట్టింది.అయితే ఆ మ్యాగజైన్‌ అహ్మదాబాద్, కేరళలను పర్యటించడానికి ఉత్తమమైన డెష్టినేషన్లుగా ఎంచుకుంది.

ఇండియాలో ఇవి రెండూ మంచి ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి.ఇప్పుడు ప్రపంచ ఖ్యాతి గడించాయి.

Advertisement

"భారతదేశపు తొలి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అయిన అహ్మదాబాద్ తాజాగా టైమ్ మ్యాగజైన్‌లో "వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ 2022" లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.ప్రతి భారతీయుడికి, ముఖ్యంగా గుజరాత్ ప్రజలకు ఇది ఎంతో గర్వకారణం.

" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.అప్పటి గుజరాత్ సీఎం ఉన్న మోదీ 2001 నుంచి దూరదృష్టితో రాష్ట్రంలో వరల్డ్ క్లాస్‌ మౌలిక సదుపాయాల కల్పనకు పునాది వేశారని అమిత్ షా అన్నారు.

ఈ జాబితాలో అహ్మదాబాద్ సెకండ్ ప్లేస్ దక్కించుకోవడం విశేషం.

ఇక కేరళ ప్రకృతి అందాలకు నిలయం.భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో కేరళ ఒకటిగా టైం మ్యాగజైన్ పొగిడింది.ఇక్కడ అద్భుతమైన బీచ్‌లు, దట్టమైన బ్యాక్‌వాటర్‌లు, దేవాలయాలు, రాజభవనాలు పర్యాటకులను కట్టిపడేస్తాయని తెలిపింది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

ఈ లిస్ట్‌లో యూఏఈలోని రస్ అల్ ఖైమా, ఉటాలోని పార్క్ సిటీ, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ వంటి ప్రదేశాలు ఉన్నాయి.

Advertisement