తల దురదతో విసుగెత్తి పోతున్నారా.. వర్రీ వద్దు ఇలా సమస్యను పరిష్కరించుకోండి!

సాధారణంగా కొందరికి తలలో విపరీతమైన దురద పుడుతుంటుంది.దాంతో ఎప్పుడు చూసినా తలను గోకుతూ ఉంటారు.

చుండ్రు, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, మురికి, స్కాల్ప్ డ్రై అయిపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి కారణాల వల్ల తల దురద పెడుతుంటుంది.ఇది చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

అందుకే ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంటారు.మీరు కూడా తల దురదతో విసుగెత్తిపోయారా.? వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

A Powerful Home Remedy For Itchy Scalp Itchy Scalp, Itchy Scalp Treatment, Home

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి( Amla Powder ) రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వ‌న్ టేబుల్ స్పూన్‌ లెమన్ జ్యూస్( Lemonade ) మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్‌ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

A Powerful Home Remedy For Itchy Scalp Itchy Scalp, Itchy Scalp Treatment, Home
Advertisement
A Powerful Home Remedy For Itchy Scalp! Itchy Scalp, Itchy Scalp Treatment, Home

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.అలోవెర జెల్‌, నిమ్మ‌ర‌సంలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మీ స్కాల్ప్ పై ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నిరోధిస్తాయి.

స్కాల్ప్ ను లోతుగా శుభ్రం చేస్తాయి.చుండ్రును క్రమంగా మాయం చేస్తాయి.ఆలివ్ ఆయిల్ స్కాల్ప్ ను తేమగా ఉంచుతుంది.

ఆరోగ్యంగా మారుస్తుంది.ఉసిరికాయ పొడి, మందారం పొడి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

హెయిర్ గ్రోత్ ను సైతం ప్రోత్సహిస్తాయి.కాబట్టి తల దురదతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

Advertisement

తాజా వార్తలు