బీజేపీ పదవుల కోసమే ఏర్పడిన పార్టీ..: జగ్గారెడ్డి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Congress Leader Rahul Gandhi ) కుటుంబం త్యాగాల కుటుంబమని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు.

అధికారం కోసం రాహుల్ గాంధీ ఎన్నడూ అడ్డదారులు తొక్కలేదని తెలిపారు.

బీజేపీ పదవుల కోసమే ఏర్పడిన పార్టీ అని ఆరోపించారు.అవకాశం వచ్చిన ప్రతిసారి తాను పీసీసీ చీఫ్ పదవి( PCC Chief ) అడుగుతానని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పీసీసీ అవకాశం ఇస్తే ఓకేనన్న జగ్గారెడ్డి( Jagga Reddy ) రెడ్డిలలో ఎవరికైనా అవకాశం ఇస్తే తానే ఆ పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మరోవైపు ఫ్రస్టేషన్ లో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు