దీపావళి సందర్భంగా కొంతమంది స్నేహితులు కలిసి అడవిలోకి వెళ్లి అక్రమంగా జింకను వేటాడి తినాలని అనుకున్నారు.
అయితే అడవిలోకి వెళ్లి జింకను గుర్తించి, ఆ జింకను గురిపెట్టి కాల్చగా ప్రమాదవశాత్తు అ బుల్లెట్ స్నేహితుడికే తగిలి అక్కడికక్కడే మృతి చెందగా.
మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన ఘటన తమిళనాడులోని జావాది హిల్స్( Javadi Hills in Tamil Nadu ) లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తమిళనాడు లోని జమునమరత్తూరుకు చెందిన శక్తివాసన్, ప్రకాష్, శక్తివేల్( Shaktivasan, Prakash, Shaktivel ) నీ ముగ్గురు స్నేహితులు జింకను వేటాడడం కోసం అడవిలోకి వెళ్లారు.
శక్తి వాసన్ జింకను గుర్తించి గురి చూసి కాల్చగా ఆ బుల్లెట్ అనుకోకుండా శక్తివేల్ కు తగిలింది.దీంతో శక్తివేల్ అక్కడికక్కడే మృతి చెందగా.
ముఖానికి గాయాలయ్యాయి.
అయితే శక్తివేల్ బంధువులు ఈ విషయం బయటకు వస్తే పెద్ద తలనొప్పిగా మారుతుందని భావించి పోలీసులకు లేదా అటవీ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శక్తివేల్ మృతదేహానికి అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు.కానీ గ్రామంలో ఉండే స్థానికులు జమునమరతుర్ పోలీసులకు( Jamunamarathur Police ) సమాచారం అందించారు.పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తిరువన్నామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy