12 ఏళ్లుగా అన్న స్థానంలో ఉద్యోగం చేస్తున్న త‌మ్ముడు.. చివ‌ర‌కు

సాధార‌ణంగా ఏకరూప కవలల‌ను గుర్తించ‌డం క‌ష్టంగానే ఉంటుంది.ఒక్కోసారి త‌ల్లిదండ్రులు కూడా క‌వ‌ల పిల్ల‌ల‌ను గుర్తించడానికి గందరగోళానికి గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది.

అయితే దీన్నే అడ్డుపెట్టుకున్న ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఘరానా మోసానికి పాల్ప‌డ్డారు.వారిద్దరు కవలలు.

A Man Doing Job With Brother Place In Godavarikhani! Man, Job, Brother Place, G

అచ్చుగుద్దిన‌ట్టు ఒకేలా ఉంటారు.ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఏకంగా 12 ఏళ్లుగా అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు.

చి‌వ‌ర‌కు అడ్డంగా బుక్ అవ్వ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.

Advertisement

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గాదె రాందాస్, గాదె రవీందర్‌ అన్న‌దమ్ములు ఉంటున్నారు.ప‌దేళ్ల క్రితం అన్న గాదె రాందాస్‌ కు టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం వ‌చ్చింది.

అయితే ఆ ఉద్యోగంలో త‌మ్ముడు గాదె రవీందర్ చేరాడు.అన్న పేరుతో 12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ ప్ర‌మోష‌న్స్ కూడా పొందారు.

ప్ర‌స్తుతం గోదావరిఖని తూర్పు డివిజన్‌లో లైన్‌మెన్ గా రవీందర్ ఉద్యోగం చేస్తున్నాడు.అయితే గ‌త కొన్ని రోజుల కింద‌ట అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఆస్తి వివాదాలు చోటుచేసుకున్నాయి.

ఈ క్ర‌మంలోనే రాందాస్ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్‌ అధికారులను ఆశ్ర‌యించి.త‌న పేరుతో త‌న త‌మ్ముడు గ‌త 12 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడ‌ని ఫిర్యాదు చేశాడు.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
తెల్ల అమ్మాయి, భారతీయుడు కలిసి ఉంటే తప్పా... ఈ తెల్లోడు ఏం చేశాడో చూడండి!

దీంతో రంగంలోకి దిగిన అధికారులు చీటింగ్ కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్ట‌గా రవీందర్ గుట్టు ర‌ట్టు అయింది.ఈ క్ర‌మంలోనే ర‌వీంద‌ర్‌ను ఉద్యోగం నుంచి త‌ప్పించి.

Advertisement

ఆరెస్ట్ చేశారు.

తాజా వార్తలు