కరీంనగర్ జిల్లా ( Karimnagar district )ఆదర్శ్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆదర్శ్‌నగర్‌లోని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
గుడిసెల్లో భారీ శబ్ధాలతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి.దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటివరకు పదికి పైగా గ్యాస్ సిలిండర్లు( Gas cylinders ) బ్లాస్ట్ అయ్యాయని తెలుస్తోంది.
అదేవిధంగా ఘటనా స్థలంలో భారీ మంటలతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 గుడిసెలు దగ్ధం అయ్యాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy