అమరావతిలోని ఆర్-5 జోన్ వ్యవహారంపై సుప్రీంలో విచారణ

అమరావతిలోని ఆర్ -5 జోన్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలోనే విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్ కు వాయిదా వేసింది.

ఈ క్రమంలో వెంటనే జోక్యం చేసుకుని విచారణ జరపాలని జస్టిస్ దత్తా, జస్టిస్ ఖన్నా ధర్మాసనానికి ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి గృహాలు నిర్మించేందుకు చేసిన ప్రయత్నాలు అడ్డుకున్నారని కోర్టుకు తెలిపారు.

రాజధానికి సంబంధించిన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉందని కోర్టుకు రైతుల తరపు లాయర్ కామత్ తెలిపారు.అయితే వెంటనే విచారణ జరపాలన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వినతిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.

ఏప్రిల్ లో తుది విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisement
ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు

తాజా వార్తలు