ట్రాఫిక్ రూల్స్ పాటించలేదని ప్రిన్సిపాల్ ని కొట్టిన పోలీస్..!

కొందరు పోలీసులు హద్దులు మీరి ప్రవర్తిస్తారు.ఒంటిపై యూనిఫాం వేసుకోగానే వారిని ఎవరూ ఎదురించలేరు అనుకుంటారేమే.

సామాన్యులపై వారి ప్రతాపం చూపిస్తారు.ఎవరినీ కొట్టే అధికారం పోలీసులకు లేదు అని వారికి తెలిసినా.

A Head Constable Hit A Motorist For Not Following The Rules In Adoni , Head Cons

అవేవీ పట్టించుకోరు.తమదే పెత్తనం అన్నట్లుగా ఇష్టారీతిగా ప్రవర్తిస్తుంటారు.

అమాయకులు, సామాన్యులపై చేయి చేసుకుంటారు.ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ అర్బన్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

నిన్న సాయంత్రం ఆదోని రోడ్డులో ఓ వ్యక్తిపై దుర్భాషలాడుతూ, కొడుతూ విచక్షణ రహితంగా ప్రవర్తించాడు.వాహనదారులు నిబంధనలు పాటించకపోతే ఫైన్ వేయాల్సింది పోయి.

దుర్భాషలాడుతూ కొట్టడం అక్కడే ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.టూ వీలర్ పై ఓ వ్యక్తి వస్తుండగా.

ఆదోని రోడ్డు పుష్ప ఆస్పత్రి సమీపంలోకి రాగానే హెడ్ కానిస్టేబుల్ జయన్న అతడిని ఆపారు.వాహనాన్ని ఆపగానే.

ఆ వ్యక్తిపై హెడ్ కానిస్టేబుల్ జయన్న తిట్ల దండకం అందుకున్నాడు.దుర్భాషలాడుతూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టాడు.

Aloe vera : వాస్తు ప్రకారం కలబంద ఈ దిశలో నాటారంటే.. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..!

పిడిగుద్దులు గుద్దారు.కాలితో తన్నారు.

Advertisement

ఆ వ్యక్తి నుండి సెల్ ఫోన్, టూ వీలర్ లాక్కొని స్టేషన్ కు తీసుకెళ్లాడు ఆ హెడ్ కానిస్టేబుల్ జయన్న.సామాన్యులు కొట్టుకుంటే స్థానికులు ఆపేందుకు ప్రయత్నిస్తారు.

కానీ ఇక్కడ ఓ సామాన్యుడిని కొట్టేది పోలీసు యూనిఫాం వేసుకున్న హెడ్ కానిస్టేబుల్ జయన్న.విచక్షణ మర్చిపోయి సామాన్యుడిపై దాడి చేసిన ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నిస్తే తమపై ఎక్కడ దాడి చేస్తాడోనన్న భయంతో ఎవరూ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు.

తాజా వార్తలు