ట్యాంక్‌లో పూడిక తీయడంతో బయట పడ్డ భారీ శివలింగం

ఇటీవల కాలంలో భగవంతుల తలపించే అనేక అపూర్వ సంఘటనలు దేశంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్నాయి.

కొన్ని కాలయాపనలో పడిపోయిన పురాతన ఆలయాల( Ancient Temples ) వెలికితీత, మరికొన్ని సహజంగా భూమిలో నుంచి దేవతా విగ్రహాల బయటపడటం వంటి ఘటనలు సామాన్య ప్రజల్లో భక్తిశ్రద్ధలను పెంపొందిస్తున్నాయి.

తాజాగా తమిళనాడులోని( Tamil Nadu ) పుదుకోట్టై జిల్లాలో ఇలాంటి మరో అరుదైన సంఘటన ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.పుదుకోట్టై జిల్లా( Pudukkottai ) మేళపులవంకాడు గ్రామంలో ప్రజలు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) ఆధ్వర్యంలో ఉన్న ఒక నీటి ట్యాంక్‌లో పూడిక తీస్తుండగా, భారీ శివలింగాన్ని( Shiva Lingam ) కనుగొన్నారు.

ఇది సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉండి, దాదాపు ఒక టన్ను బరువుతో ఉంది.శివలింగం పాక్షికంగా మట్టితో కప్పబడి ఉండటం గమనార్హం.

దీనిని అనేక వందల సంవత్సరాల నాటి పురాతన శివలింగంగా భావిస్తున్నారు స్థానికులు.

Advertisement

ఈ అపూర్వమైన శివలింగం కనిపించగానే గ్రామస్థులు వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.దానితో స్థానిక అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో శివలింగాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు.అనంతరం శివలింగాన్ని తాలూకా కార్యాలయానికి తరలించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు.

అయితే దొరికిన శివలింగాన్ని తిరిగి అదే ప్రదేశంలో ప్రతిష్టించాలని గ్రామస్థులు కోరుతున్నారు.అక్కడ ఆలయం నిర్మించి రోజువారీ పూజలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని వారు తెలిపారు.

ఈ విషయాన్ని ఆ ప్రాంత పంచాయతీ ప్రెసిడెంట్ దేవాదాయ శాఖకు అధికారికంగా కోరారు.ఇది తమ గ్రామానికి మతపరమైన, సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యమున్న చిహ్నమని వారు పేర్కొంటున్నారు.

ఈ ఘటన స్థానికంగా విశేష చర్చనీయాంశమైంది.శివలింగం వెలికితీసిన ప్రాంతానికి స్థానికులు భారీగా తరలివచ్చి దర్శించుకుంటున్నారు.ఇది తమ గ్రామ పురాతన వారసత్వానికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

ఆలయ నిర్మాణానికి సంబంధించిన కసరత్తులు కూడా గ్రామస్థుల భాగస్వామ్యంతో ప్రారంభమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు