బిస్కెట్ ప్యాకెట్ కంటే తక్కువకే విమాన టికెట్

చాలా మందికి విమానం ఎక్కాలనే చిరకాల కోరిక ఉంటుంది.అలాంటి వారికి ఇది నిజంగా బంపరాఫర్.

విమాన ప్రయాణికులను ఆకర్షించేందుకు విమానయాన సంస్థలు పోటీపడి మరీ తక్కువ ధరకే టికెట్లు అందిస్తున్నాయి.భారీ డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లతో విమాన ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తున్నాయి.

A Flight Ticket Is Less Than A Packet Of Biscuits , Cost, 9rs, Flight Ticket, Vi

వచ్చే ఆరు నెలల కాలంలో ఈ ఆఫర్లను ఉపయోగించుకుని, దేశీయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే ఆఫర్లను ప్రకటించాయి.వాటిని చూసిన పలువురు ఆశ్చర్యపోతున్నారు.ఇండిగో రూ.1499కు, ఎయిర్ ఏషియా రూ.1499, స్పైస్ జెట్ రూ.1498, గోఫస్ట్ రూ.1499కు విమాన టికెట్లను అందిస్తున్నాయి.వీటన్నింటినీ తలదన్నేలా వియట్ జెట్ సంస్థ రూ.9కే విమాన టికెట్లను అందిస్తోంది.ఇది చూసిన ప్రజలంతా బిస్కెట్ ప్యాకెట్ కంటే విమాన టికెట్ చౌకగా ఉందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.

వీటి గురించిన వివరాలిలా ఉన్నాయి.ఇండిగో సంస్థ రూ.1499కే దేశీయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తోంది.ఈ ఆఫర్ దేశీయ విమాన ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుందని చెబుతోంది.

Advertisement

ఈ ఆఫర్ కింద కస్టమర్‌లు ఆగస్టు 15, 2022 నుంచి డిసెంబర్ 31, 2022 మధ్య ప్రయాణించొచ్చు.అయితే తమ ప్రయాణాలకు సంబంధించి టికెట్లు జూలై 28, 2022 నుండి జూలై 31, 2022 వరకు బుక్ చేసుకోవచ్చని ఆఫర్ ప్రకటించింది.

స్పైస్‌జెట్ కూడా దేశీయ విమాన టిక్కెట్ల విక్రయాన్ని ప్రకటించింది.అది కూడా రూ.1498కే విమాన టికెట్లను అందిస్తోంది.ఈ టికెట్ల సేల్ జూలై 28న ప్రారంభమైంది.

ఆగస్టు 15 మరియు సెప్టెంబర్ 25 మధ్య తేదీలలో విమాన ప్రయాణాలకు టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం అందించింది.గో ఫస్ట్ సంస్థ కూడా కూడా ఇదే విధమైన ఆఫర్లను ప్రకటించింది.దేశీయ విమాన టిక్కెట్‌లను తక్కువ ధరకే రూ.1799కు విక్రయించింది.ఈ ఆఫర్ 15 ఆగస్టు 2022 నుంచి 31 మార్చి 2023 మధ్య ప్రయాణ వ్యవధి కోసం కేటాయించింది.

ఈ ఆఫర్‌లో భాగంగా 31 జూలై 2022లోపు టికెట్‌లు బుక్ చేసుకోవాలని సూచించింది.ఎయిర్ ఏషియా కూడా పే డే సేల్‌ పేరుతో రూ.1,499కే విమాన టికెట్లను అందించింది.ఢిల్లీ-జైపూర్ వంటి రూట్లలో, దాని నెట్‌వర్క్ అంతటా ఇదే విధమైన తగ్గింపు విక్రయ ఛార్జీలను ప్రకటించింది.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఇక వియత్నాంకు చెందిన వియట్‌జెట్ సంస్థ బంపరాఫర్ ప్రకటించింది.విమాన టికెట్‌ను రూ.9కే అందిస్తామని ప్రకటించింది.15 ఆగస్టు 2022 నుంచి 26 మార్చి 2023 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.దీని కోసం 30 వేల ప్రమోషనల్ టికెట్లను ఈ సంస్థ అందుబాటులో ఉంచింది.

Advertisement

వీటిని చాలా మంది వినయోగించుకున్నారు.పలువురు ఈ ఆఫర్లు ఉపయోగించుకోలేకపోయామని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు