కొన్నాళ్ళ క్రితం తండ్రి...నేడు కొడుకు బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా:వలిగొండ మండలం( Voligonda ) రెడ్లరేపాక గ్రామంలో విషాదం నెలకొంది.

గ్రామానికి చెందిన శంకరయ్య కుటుంబ ఆర్ధిక పరిస్థితిపై ఆత్మహత్య( suicide )కు పాల్పడ్డాడు.

ఆ దుఃఖం నుండి తెరుకోక ముందే సోమవారం కొడుకు శివ(20) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.

శంకరయ్య,శ్యామల దంపతుల రెండో కుమారుడు శివ ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు.రోజు పని దొరకకపోవడంతో ఆరిక సమస్యతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

దీనితో తండ్రి,కొడుకు ఇద్దరూ అర్ధాంతరంగా తనువులు చాలించడంతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.

Advertisement
Plinko: Pagos Y Acceso A La Cuenta — Guía Práctica Para Jugadores En Chile

Latest Yadadri Bhuvanagiri News