సక్సెస్ స్టోరీ: పద్నాలుగేళ్లకే కవలలకు తల్లైంది..కుటుంబం కోసం కూలి పనిచేసింది..ఇప్పుడు అంతర్జాతియ స్థాయికి చేరుకుంది.

వివాహం విద్యానాశాయా.సంతానం సర్వనాశాయా అని ఒక సంస్కృత సామెత ఉంది.

దానర్దం వివాహం మహిళ విద్యని నాశనం చేస్తే,పుట్టిన పిల్లల వలన మొత్తం నాశనమవుతుందని.ఆ సామెతకి తగినట్టుగానే చాలామంది మహిళలు పెళ్లై పిల్లలు పుట్టాక తాము ఇక ఏం చేయలేమని నిరాశ నిస్ప్రుహల్లో కూరుకుపోతుంటారు.

అటువంటి వారికి స్పూర్తి రెజ్లర్ నీతూ.

హర్యానాలోని మారుమూల గ్రామం బేద్వాకు చెందిన నీతుకు చిన్నప్పటి నుంచి కుస్తీ అంటే చాలా ఇష్టం.అందుకు కారణం తన చుట్టుపక్కల అంతా కుస్తీ వాతావరణం ఉండటమే.దీంతో ఆమె కూడా కుస్తీని నేర్చుకోవాలనుకుంది.

Advertisement

కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆ కోరిక తీరలేదు.ఆర్థిక కష్టాల వలన ఆడపిల్ల భారం దించేసుకోవాలని భావించిన ఆ కుటుంబం 13ఏళ్లకే నీతును 40ఏళ్ల వయసున్న మానసిక వికలాంగుడికి ఇచ్చి పెళ్లిచేసింది.

ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె మూడో రోజే భర్త నుంచి విడిపోయింది.దాంతో నీతుని తీవ్రంగా తిట్టిన కుటుంబం,కొట్టినంత పనిచేసింది.

అయినా, వాటిని నీతు పెద్దగా పట్టించుకోలేదు.తాను జీవితంలో సాధించాల్సింది వేరే ఉందని అప్పుడే బలంగా నమ్మింది.

నీతు ధోరణిని కుటుంబం అంతా వ్యతిరేఖించినప్పటికి సంజయ్ అనే వ్యక్తి ఆమెకు అండగా నిలిచాడు.కుటుంబాన్ని ఎదిరించి అతడిని వివాహం చేసుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

నీతు ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.కుటుంబ పోషణ కోసం రోజు వారి కూలీగా పని చేసింది.

Advertisement

కానీ, తనకు ఎంతో ఇష్టమైన కుస్తీ పోటీలను మాత్రం వదిలిపెట్టలేకపోయింది.ఈ సమయంలో తన భర్త నుంచి ప్రోత్సాహం లభించడంతో 2011లో కుస్తీ నేర్చుకోవడం మొదలుపెట్టింది.

ఇద్దరు కవలలకు తల్లి.కుస్తీల్ల ఇదేం గెలుస్తుందని చుట్టుపక్కల వాళ్లు వెక్కిరించేవారు.

అయినా అవేవి పట్టించుకోకుండా అతి తక్కువ కాలంలో కుస్తీలో మెలకువలన్నీ నేర్చుకుంది.దీనికోసం కఠోర శ్రమ చేసింది.

కుస్తీ కోసం తన ఇద్దరు పిల్లలను వదిలి 50 కిలోమీటర్ల దూరం వచ్చి ఒంటరిగా ఉంటూ శిక్షణను పూర్తి చేసుకుంది.రెండేళ్ల పాటు పిల్లలకు దూరంగా గడిపింది.రోహ్‌తక్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని శిక్షణ శిబిరంలో కోచ్‌ మన్‌దీప్‌ పర్యవేక్షణలో రాటుతేలింది.2015 కేరళలో జరిగిన జాతీయ క్రీడలోల 57కేజీల విభాగంలో రజతం గెలిచి నీతు సత్తా చాటింది.ఆ తర్వాత మళ్లీ ఆమెకు ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.

అయితే రెజ్లింగ్‌లో నీతుకు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన సహస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బి) ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చి ప్రోత్సహించింది.ఆర్దిక ఇబ్బందుల నుండి వెసలుబాటు లభించడంతో కుస్తీలో మళ్లీ పుంజుకుంది.

నీతు తాజాగా హర్యానా వేదికగా జరిగిన అండర్‌ 23 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది.అదే సమయంలో బుకారెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కూడా ఎంపికైంది.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన సందర్భంగా నీతు మాట్లాడుతూ రెజ్లింగ్‌లోకి వచ్చినందుకు నన్ను తిట్టిన గ్రామస్థులే ఇప్పుడు నేను సాధించిన పతకాలు చూసి గర్వపడుతున్నారు.నన్ను స్ఫూర్తిగా తీసుకోమని తమ కుమార్తెలకు చెబుతున్నారు.

సుశీల్‌ 4 స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వాళ్లే రోహ్‌తక్‌లో నాకు ఆశ్రయమిచ్చారని ,రెజ్లింగ్ లో సుశీల్ కుమారే నాకు స్పూర్తి అని తెలిపింది.

తాజా వార్తలు