వైరల్: వికలాంగుడైన ఆ సన్యాసి మానవత్వంలో మహా ఋషి... మూగజీవాల దాహం తీరుస్తున్న వైనం!

మనుషులలో సన్యాసులు చాలా ప్రత్యేకమైనవారు.

సన్యాసి అనే పదాన్ని మనవాళ్ళు తెలియని తనంతో సన్నాసిగా మార్చేశారు గాని, నిజంగా దానికి అర్ధం తెలిసినవారు ఎవరూ వారిని ఆ విధంగా సంబోదించి కించపరచరు.

వాస్తవానికి సనాతన ధర్మంలో వీరికి చాలా విశిష్టత వుంది.సన్యాసి అంటే సర్వస్వాన్ని త్యజించినవాడు అని అర్ధం.

అలా సర్వం వదిలేసి సత్యాన్వేషణ కోసం వారు పయనిస్తారు.ఇక అలాంటివారు ఎలాంటి కార్యాలు చేసినా అందులో నిగూఢ అర్ధం దాగి ఉంటుంది.

ఇంకా వారు సర్వప్రాణుల పట్ల ఒకే విధమైన అనుబంధాన్ని కలిగి వుంటారు.మానవత్వం, పరోపకారం మరిచిన ఈ రోజుల్లో ఓ సాధుపుంగవుడు, పైగా వికలాంగుడైన అతను అనేకమందికి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నాడు.

Advertisement

అవును, నేటి కాలంలో సాటి మనుషులకే సాయం చేయలేని పరిస్థితి.అలాంటిది జంతువులకు సహాయం అంటే ఇక కష్టమే.

అయితే ప్రస్తుతం ఒక కోతికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కాగా ఇది అందరి హృదయాలను గెలుచుకుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.వికలాంగుడైన సన్యాసి తన పక్కనే కూర్చున్న కోతికి నీళ్లు తాగించడం నిజంగా అద్భుతం.

వీడియో ఒక్కసారి గమనిస్తే కోతి ఏదో తింటూ దాహం అన్నట్టుగా ముఖం పెట్టుకొని ఉండటంతో గమనించిన ఆ బాబా నెమ్మదిగా ఒక గ్లాసు నీళ్లను తెచ్చి ఆ గ్లాస్ ను కోతి వైపు చాచి.నీరు త్రాగమని కోరాడు.దాంతో కోతి అతని వైపు చూసి.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

చేతిలో నీటి గ్లాసును చూడగానే.ఆత్రంతో వెంటనే నీరు త్రాగడానికి ప్రయత్నించింది.

Advertisement

ఆ బాబా పిల్లవాడికి నీరు పెట్టినట్లుగా కోతికి నీరు పట్టించడం గమనార్హం.హృదయాన్ని హత్తుకునే వీడియో @Gulzar_sahab అనే IDతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా వెలుగు చూసింది.

కాగా నెటిజన్లు ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారు.

తాజా వార్తలు