భారీగా సబ్స్క్రిప్షన్ ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్..!

ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ లలో ఒకటి అయిన నెట్ ఫ్లిక్స్ తన కస్టమర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.

ఇకమీదట ప్రస్తుతం ఉన్న ప్లాన్ ధరలను తగ్గించాలనే ఆలోచన చేస్తుంది నెట్ ఫ్లిక్స్.

కరోనా సమయంలో ఆన్లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లకు మంచి క్రేజ్ వచ్చింది.ఒకవిధంగా చెప్పాలంటే విపరీతమైన పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ తన యూజర్స్ ను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.2016 వ సంవత్సరంలోనే ఇండియాలో నెట్ ఫ్లిక్స్ సేవలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ధరల విషయంలో హెచ్చు తగ్గులు రాలేదు.కానీ మొట్ట మొదటిసారి నెట్ ఫ్లిక్స్ ధరలను తగ్గించింది.

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ తమ సభ్యత్వం యొక్క ప్లాన్స్ ను దాదాపు 50% మేర పెంచినది.డిసెంబర్ 14 నుంచి పెంచిన ధరలు అందుబాటులోకి వస్తాయని ముందుగానే ప్రకటించింది.

కానీ నెట్ ఫ్లిక్స్ మాత్రం అందుకు భిన్నంగా ధరలను తగ్గించింది.మరి నెట్ ఫ్లిక్స్ తగ్గించిన ప్లాన్ వివరాల విషయానికి వస్తే 2019 జూలై నెలలో లాంఛ్​ చేసిన నెట్ ఫ్లిక్స్ మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను రూ.199 నుండి రూ.149కి తగ్గించింది.ఎంట్రీ లెవల్ బేసిక్ ప్లాన్ రూ.499 నుండి రూ.199కి తగ్గించింది.ఖరీదైన ప్రీమియం టైర్ ధరను 799 రూపాయిల నుండి రూ.649కి తగ్గించింది.ఒకవేళ యూజర్ రూ.499 బేసిక్ ప్లాన్ నుండి, తాను స్టాండర్డ్‌ కు మారాలని భావిస్తే రూ.499కే స్టాండర్డ్ ప్లాన్‌ లోకి మారవచ్చు.అంటే తక్కువ ధరకే యూజర్లు కొత్త ప్లాన్‌లోకి అప్ గ్రేడ్ కావొచ్చు.

Advertisement

ఈ కొత్త ధరలు ఎప్పటినుండి అమలులోకి వస్తాయంటే ఆయా కస్టమర్ల తదుపరి బిల్లింగ్ సైకిల్ నుండి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.అలాగే నెట్ ఫ్లిక్స్ తమ యూజర్లను పెంచుకునేందుకు ఆటో అప్గ్రేడ్ అనే కొత్త ఫీచర్‌ను ఇటీవల తీసుకు వచ్చింది.నెట్ ఫ్లిక్స్ ధరలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయని, భారత్‌లో తమ సేవలు ఇంకా వృద్ధి చెందాలంటే ధరలు అవరోధంగా మారాయి అంటున్నారు.

ఇప్పటికే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లు అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ ఎంటర్నైన్మెంట్ జీ5, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్, సోనీ లైవ్ నుండి నెట్ ఫ్లిక్స్ గట్టి పోటీని ఎదుర్కొంటోంది.అందుకనే ఇలా ధరలు తగ్గించే ఆలోచన చేసినట్టు నెట్ ఫ్లిక్స్ చెబుతుంది.

Advertisement

తాజా వార్తలు