ఈ సరికొత్త యాప్‌ దినసరి కూలీల కోసమే..!

కరోనా నేపథ్యంలో కొన్ని వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు.ఇప్పటికే చాలా మంది వారి సొంత ఊరిబాట కూడా పట్టారు.

చిన్నాచితకా నిర్మాణరంగం పనులు జరుగుతున్నాయి.ముఖ్యంగా ఇప్పడుప్పుడే ఎదుగుతున్న దినసరి కూలీల భవితవ్యం ఆగమ్యగోచరంగా మారింది.

వీరి కోసం కొన్ని సంస్థలు నిధులు సేకరిస్తున్నాయి.కూలీల కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను తయారు చేశారు.

తద్వారా సులభంగా వారికి ఉపాధి దొరుకుందని పేర్కొన్నారు.ముఖ్యంగా అప్పా అనే స్టార్టప్‌ కంపెనీ ఈ నిధుల సేకరణకు పూనుకుంది.ఇప్పటి వరకు దాదాపు రూ.515 కోట్లు సేకరించినట్లు తెలిపింది.ఇందులో ప్రధాన భాగస్వాములుగా టైగర్‌ గ్లోబల్, సీక్యోవా క్యాపిటల్, రాకెట్‌ షిప్‌ వీసీ, స్పీడ్‌ ఇండియా ఉన్నాయి.

Advertisement

అప్పా ద్వారా ముఖ్యంగా అసంఘటిత రంగ దినసరి కూలీలకు సరైన ఉద్యోగం కల్పించి, భద్రతను పెంచనుంది.అంటే దినసరి కూలీల ఉద్యోగ ప్రక్రియను కూడా డిజిటలైజ్‌ చేయనుంది.

తద్వారా సరైన యజమానుల కింద వీరికి పని లభించే విధంగా ఆవిష్కరించింది.కరోనా నేపథ్యంలో ఇప్పటికే సగం చితికి పోయిన వారి భవితవ్యాన్ని తీర్చిదిద్దనుంది అప్పా.

ఈ యాప్‌ వివిధ భాషల్లో అందుబాటులో ఉండనుంది.దాదాపు 70 రకాల కమ్యూనిటీలకు చెందిన వృత్తులు ఇందులో నమోదై ఉంటాయి.చేతివృత్తులు, వడ్రంగి ఇతర రంగాల వారు ఉండనున్నారు.

వీరికి సరైన అవగాహన కల్పించే కొన్ని ఉపయోగం చేందే సూచనలు కూడా అందుబాటులో ఉండనున్నాయి.అంతేకాదు ఈ ప్లాట్‌ఫారం పై ఒకరినొకరు ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం లభిస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తద్వారా వారి మధ్య ఓ అవగాహన పెరిగుతుంది.ఈ అప్పా యాప్‌లో రెండూ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి.

Advertisement

యూనిసెఫ్, వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థలు వీరికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి.అప్పాలో మొత్తం లక్షకు పైగా నియామక సంస్థలు అందుబాటులో ఉన్నాయి.

అనాకాడమీ, బైజూస్, బర్గర్‌ కింగ్, డంజో, భారతీ యాక్సా, షాడోఫాక్స్, ఇంక ఇతర మల్టీ నేషనల్‌ కంపెనీలు కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నాయి.ఇందులో రిజిస్టర్‌ అవ్వడానికి చాలా సులభం.

ఈ యాప్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకున్న అతి కొద్ది రోజుల్లోనే సంబంధిత వ్యక్తులు మిమ్మల్ని కాంటాక్ట్‌ అవుతారు.అంతేకాదు, ఈ యాప్‌లో ఇంటర్వ్యూ సంబంధించిన స్కిల్స్‌ను అందిస్తుంది.

రెజ్యూమ్‌ తయారీ, కౌన్సెలింగ్‌ కూడా సాయపడుతుంది.

తాజా వార్తలు