మాస్క్ పెట్టుకోలేదు.. 67 వేల కేసులు నమోదు..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.

లాక్ డౌన్ సడలింపు లకు ముందు ఎంతో కంట్రోల్ లో ఉన్న మహమ్మారి కరోనా వైరస్.

ప్రస్తుతం తెలంగాణలో బ్రేక్ డాన్స్ చేస్తోంది.దీంతో రోజు రోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.ప్రతిరోజు దాదాపుగా 1000 వరకు కేసులు నమోదవుతున్నాయి.

ఇక ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాని నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ వైరస్ కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.మాస్కు ధరించని వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తోంది తెలంగాణ సర్కార్.

అయితే మాస్క్ ధరించకుండా బహిరంగంగా సంస్కరించినందుకు రాష్ట్రవ్యాప్తంగా 67557 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.మరో 3288 మందికి చలానాలు కూడా జారీ చేసారు.

Advertisement

లాక్‌డౌన్‌ అమలైన మార్చి 22 నుంచి 30 వరకు 29 పోలీస్ స్టేషన్లో కలిపి 67557 కేసులు నమోదయ్యాయి.హైదరాబాద్‌లో అత్యధికంగా 14,931, రామగుండం కమిషనరేట్‌(8,290), ఖమ్మం(6,372), సూర్యాపేట(4,213), వరంగల్‌(3,907) ఉన్నాయి.

అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు